నాసా సంచలన ప్రకటన.. 2068లో జీవకోటి అంతం?

భారత్ తో పాటు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే.దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలీదు.ఇలాంటి సమయంలో భూగ్రహం అంతం కాబోతుందంటూ నాసా చేసిన సంచలన ప్రకటన ప్రజలకు మరింత భయాందోళనకు గురి చేస్తూ ఉండటం గమనార్హం.2068 సంవత్సరంలో భూమిపై జీవకోటి అంతం కానుందని నాసా చెబుతోంది.

 Asteroid Could Wipe All Of Humanity In Year 2068, Asteroid Apophis, Sunlight, Hu-TeluguStop.com

ఒక గ్రహశకలం భూమికి సమీపంలోకి రానుందని.ఆ గ్రహశకలం ఢీ కొట్టడం వల్ల జీవకోటికి ముప్పు ఏర్పడబోతుందని నాసా చెబుతోంది.వాస్తవానికి భూగ్రహం అంతం కాబోతుందని, యుగాంతం రాబోతుందని వార్తలు వెలువడటం ఇదే తొలిసారి కాదు.దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే గతంలో వచ్చిన వార్తలు పుకార్లే అయినప్పటికీ ఈ వార్తలను మాత్రం ఖచ్చితంగా నమ్మాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

అపోఫిస్‌ -99942 అనే గ్రహశకలం భూమిని ఢీ కొట్టనుందని.

ఈ గ్రహశకలం భూమిని ఢీ కొడితే ఖచ్చితంగా భూమి అవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.చాలా సంవత్సరాల క్రితమే గుర్తించిన ఈ గ్రహశకలం భూమికి సమీపంలోకి రానుందని 1 : 150 నిష్పత్తిలో భూమిని గ్రహశకలం ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.దీంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది.
ఇప్పటికే భూమిపై మనుషులు వినియోగిస్తున్న వాహనాల వల్ల కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది.

భూమిపై కార్బన్ బై యాక్సైడ్ స్థాయి పెరగడంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి.ఇప్పటికే కాలుష్యం వల్ల ముప్పు ఉందని నిపుణులు ప్రకటనలు చేస్తున్న తరుణంలో నాసా చేసిన ప్రకటన ప్రజలను మరింత టెన్షన్ పెడుతుండటం గమనార్హం.

నాసా 2004 సంవత్సరంలో ఈ గ్రహశకలాన్ని గుర్తించింది.ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమికి 32,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళుతోంది.నాసా లాంటి కీలక సంస్థ చెప్పడంతో ఈ వార్త నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube