భూమి వైపు వేగంగా వస్తున్న గ్రహశకలం..! మరి నాసా ఏమంటుందంటే..?!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA) చెప్పిన ప్రకారం మార్చి 21వ తేదీన 2001 F032 అనే ఒక అతిపెద్ద ఆస్ట్రాయిడ్ భూమికి చాలా దగ్గరగా ప్రయాణించనున్నది.విశ్వంలోని అన్ని ఉల్కల కంటే 97 శాతం పరిమాణం లో పెద్దగా ఉన్న  ఈ ఉల్క సుమారు 0.767 నుండి 1.714 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉందని ఇది ప్రస్తుతం సౌర వ్యవస్థకు చేరుకోబోతోందని నాసా ప్రకటించింది.నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ 2001 F032 ఉల్క ను ఓ ప్రమాదకర గ్రహశకలం అని పేర్కొంది.అయితే ఈ ఉల్క భూమికి 20 లక్షల కిలోమీటర్ల దూరంలో ఒక్క సెకండ్ కి 34.4 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళనున్నది.దీంతో ఈ ఉల్క భూమి పై ప్రయాణించేటప్పుడు సాధారణ కంటికి కనిపించదు.

 Asteroid Coming Fast Towards The Earth And What About Nas America, Stateite, Ear-TeluguStop.com

కానీ శాస్త్రవేత్తలు కొన్ని పరికరాలను ఉపయోగించి వీటి కదలికలను పరిశీలిస్తారు.8 ఇంచుల టెలిస్కోపు ఉంటే ఈ ఆస్ట్రాయిడ్ ని చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే ఈ ఆస్ట్రాయిడ్ కదలికలను గమనించాలంటే దాదాపు ఐదు నుంచి పది నిమిషాల సమయం పట్టొచ్చు.ఇకపోతే భారతదేశ కాలమానం ప్రకారం 2021 మార్చి 21వ తేదీన రాత్రి 9 గంటల 33 నిమిషాలకు 2001 F032 ఆస్ట్రాయిడ్ భూమిపై నుంచి వెళ్లనున్నది.

దక్షిణం వైపు వేగంగా దూసుకెళ్లే ఈ ఉల్క ని చూడాలనుకునే ఉత్తరం వైపు పరిశీలకులు వృశ్చిక, ధనుస్సు దక్షిణ నక్షత్రరాశుల మధ్య చూడాల్సి ఉంటుంది.

అయితే ఇటువంటి అరుదైన ఆస్టరాయిడ్స్ 200 సంవత్సరాలకు ఒకసారి భూమి కి దగ్గరగా ప్రయాణిస్తాయి అని నాసా చెబుతోంది.

అయితే 2001 F032 ఉల్క 31 ఏళ్ల తర్వాత అనగా 2052 మార్చి 22న మళ్లీ భూమికి సమీపంగా ప్రయాణించనుందని నాసా వెల్లడించింది.దక్షిణ అర్ధగోళంలో, దిగువ అక్షాంశాలలో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశీలకులు ఈ ఉల్క ని బాగా వీక్షించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube