IDBIలో అసిస్టెంట్ మేనేజర్లు.. చివరి తేదీ ఆగస్ట్ 22 

ముంబైలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) అసిస్టెంట్ మేనేజర్ ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రిక్రూట్మెంట్లో భాగంగా మొదట IDBI మణిపాల్ ( బెంగళూరు), నిట్టే ( గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి ఏడాది (తొమ్మిది నెలల క్లాస్, రూమ్, 3 నెలలు ఇంటర్ షిప్) వ్యవధి లో గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(డిబిఎఫ్) లో శిక్షణ ఇస్తుంది.

దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇస్తుంది.మొత్తం ఖాళీలు  : 650 అర్హత  : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.వయసు  : 2021 జూలై 1 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు.

పీడబ్లూడీ అభ్యర్థులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం  : ఆన్లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు పరీక్ష విధానం  : దీన్ని మొత్తం 200 మార్కులు నిర్వహిస్తారు 200 ప్రశ్నలు ఉంటాయి పరీక్ష సమయం 2 గంటలు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది సమాధానం తప్పుగా గుర్తిస్తే 0.25 చొప్పున మార్కు కట్ చేస్తారు.పరీక్షలో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40, జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవెర్ నెస్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.దరఖాస్తు విధానం  : ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు చివరి తేదీ  : ఆగస్ట్ 22 పరీక్ష తేదీ సెప్టెంబర్ 4 తెలుగు రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు  : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వెబ్ సైట్ https://www.idbibank.in/.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు