ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు...తొలిసారి ప్రతిపక్షనేతగా బాబు  

Assembly Meeting Is Started Today-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో తొలిసారిగా అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా మాజీ సి ఎం చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్ల లో భారీ మెజారిటీ తో గెలుపొంది నవాంధ్ర లో ప్రభుత్వాన్ని ఏర్పరచిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తొలిసారి గా అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నిర్వహించారు.ఈ క్రమంలో తొలుత వెంటక పాలెంలో ఎన్ఠీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బాబు నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

Assembly Meeting Is Started Today--Assembly Meeting Is Started Today-

నవాంధ్ర ఏర్పడిన తరువాత తోలి సీ ఎం గా బాబు 5 సంవత్సరాలు సేవలు అందించారు.అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలవడం తో ఘోర ఓటమి పాలైంది.అయితే ఈ రోజు తొలిసారి జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Assembly Meeting Is Started Today--Assembly Meeting Is Started Today-

ఈ క్రమంలో తొలుత అసెంబ్లీ లో ఇటీవల ఏర్పడిన జగన్ క్యాబినెట్ మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు మంత్రుల చేత మరోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.ఇటీవల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.

అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా కూడా అందరి ముందు మంత్రులు అందరూ కూడా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.అయితే తోలి రోజు సమావేశాల్లో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి అన్న వివరాలు తెలియరాలేదు.