తెలంగాణ రాష్ట్రంలో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS ) ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అన్నారు.అసెంబ్లీ సమావేశాల( Assembly Meeting ) నాటికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వస్తుందని తెలిపారు.
మేడిగడ్డ ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
త్వరలోనే అసెంబ్లీ తేదీలు ప్రకటిస్తామని తెలిపారు.మున్ముందు బీఆర్ఎస్ ఉనికి కష్టమేనన్నారు.కేసీఆర్( KCR ) భ్రమల్లో బతకడం మానేసి వాస్తవంలోకి రావాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ మధ్యనే పోటీ అని చెప్పారు.కాంగ్రెస్ కి( Congress ) 13 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు.