అక్కడ 7 రోజులే హోం క్వారంటైన్..!?

కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు వేలల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

 Assam, Home Quarantine, 7 Days, Corona Virus, Covid-19, Assam Government Reduces-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో అయితే కరోనా వైరస్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.ఇంకా అలాంటి కరోనా వైరస్ వ్యాపించి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారికి ఆసోం ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

డిశ్చార్జ్ అయినా తరువాత కేవలం వారం రోజులు మాత్రమే హోమ్ క్వారంటైన్ లో ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో 14 రోజులు హోమ్ క్వారంటైన్ గడువును ఇప్పుడు ఏడు రోజులకు కుదించారు.

అంతేకాదు.ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారికీ రూ.రెండు వేలు విలువైన అత్యవసర వస్తువుల పంపిణీని కూడా ఇప్పటి నుండి నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

పేదలకు మాత్రం ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే.సందర్భాన్ని బట్టి వృద్ధులకు, వికలాంగులకు, దీర్ఘరోగ వ్యాధిగ్రస్తులకు ఈ సదుపాయం కలిపిస్తున్న డిప్యుటీ కమిషనర్‌కు అధికారాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా అసోంలో ఇప్పటివరకూ 29,921 కరోనా కేసులు నమోదయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube