తాడిప‌త్రిలో పుంజుకుంటున్న అస్మిత్‌రెడ్డి.. కొడుకు కోసం తండ్రి ఆరాటం

జేసీ బ్ర‌ద‌ర్స్ అంటే అంన‌త‌పురం జిల్లాలో తిరుగులేని నేత‌లుగా ఇప్ప‌టికీ కూడా చ‌క్రం తిప్పుతున్నారు.మొన్న‌టి ఓట‌మికు ముందు నుంచే వారు జిల్లాలో తిరుగులేని రాజ‌కీయాలు చేస్తున్నారు.

 Asmit Reddy Recovering In Tadipantri Father Cares For Son Asmit Reddy-TeluguStop.com

కాగా మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోయ‌న త‌ర్వాత కాస్త వెన‌క‌బ‌డ్డ వారు ఇప్పుడు మ‌ళ్లీ దూకుడు పెంచుతున్న‌ట్టు తెలుస్తోంది.అనంతపురం జిల్లాలో వీరికి కంచుకోట అయిన‌ తాడిపత్రి ఎప్ప‌టికీ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.

ఇక్క‌డ నువ్వా నేనా అన్న‌ట్టు వార్ న‌డుస్తుంది.గ‌త 40 ఏండ్ల నుంచి వీరు ఇక్క‌డి నుంచి త‌మ హ‌వాను కొన‌సాగించారు.

 Asmit Reddy Recovering In Tadipantri Father Cares For Son Asmit Reddy-తాడిప‌త్రిలో పుంజుకుంటున్న అస్మిత్‌రెడ్డి.. కొడుకు కోసం తండ్రి ఆరాటం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంత‌పురం జిల్లాలో ఒక‌ప్పుడు మ‌కుఠం లేని మ‌హారాజుల్లాగా త‌మ మాట‌ల‌ను చెల్లించుకున్న వీరి హ‌వా గ‌త ఎన్నిక‌ల్లో నుంచే త‌గ్గిపోయింది.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం వారి వార‌సుల‌ను నిల‌బెట్టి ప్ర‌యోగం చేశారు.

కాగా వారు ఓడిపోవ‌డంతో వీరి హ‌వా కొద్దిగా త‌గ్గిపోయింది.కానీ ఇప్పుడు ప్రభాకర్ కొడుకు అయిన జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా టీడీపీ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచి ఓడిపోయారు.

ఇక దివాక‌ర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి కూడా టీడీపీ నుంచే టికెట్ ద‌క్కించుకుని అనంతపురం ఎంపీగా బ‌రిలో నిలిచి వైసీపీ చేతిలో ఓడిపోయారు.

Telugu Ap News, Ap Politics, Asmit Reddy, Asmit Reddy Recovering In Tadipantri, Chandrababu, Father Cares For Son, Jc Brothers, Jc Prabhakar Reddy, Tdp, Ysrcp-Telugu Political News

ఇలా ఇద్ద‌రి బ్ర‌ద‌ర్స్ కొడుకులు ఓడిపోవ‌డంతో వీరి హ‌వా త‌గ్గింద‌ని అంతా అనుకుంటున్న స‌మ‌యంలో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ చైర్మ‌న్ గా గెల‌వ‌డంతో నెమ్మ‌దిగాన త‌న కొడుకునుబ‌ల‌మైన నేత‌గా త‌యారు చేస్తున్నారు.నియోజ‌క‌వ‌ర్గంలో తనయుడికి అన్ని విధాలుగా అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచే విధంగా పావులు క‌దుపుతున్నారు.త‌న కొడుకు భ‌విష్‌య‌త్తుకు బ‌ల‌మైన పునాదులు వేస్తున్నారు.ఇప్ప‌టికే మన ఊరు-మన బాధ్యత లాంటి ప్రోగ్రామ్‌ల‌తో ఊర్ల‌న్నీ చుట్టేస్తున్నారు.చూడాలి మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో.

#Father #Chandrababu #Ysrcp #Asmit Reddy #AsmitReddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు