సెకండ్ ఇన్నింగ్స్‌కు నాట్ రెడీ అంటోన్న బ్యూటీ  

Asin In No Mood To Do Movies, Asin, Rahul Sharma, Bollywood News, Comeback - Telugu Asin, Asin In No Mood To Do Movies, Bollywood News, Comeback, Rahul Sharma

టాలీవుడ్‌లో ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆసిన్, ఆ తరువాత స్టార్ హీరోయిన్‌గా మారింది.కొంతకాలానికి బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన ఈ బ్యూటీ, అక్కడే సినిమాలు చేస్తూ, ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు టాటా చెప్పేసింది.

TeluguStop.com - Asin Not Interested To Act In Movies

ఇలా సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆసిన్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందనే వార్త ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆసిన్ సన్నిహితులు తేల్చిచెబుతున్నారు.

TeluguStop.com - సెకండ్ ఇన్నింగ్స్‌కు నాట్ రెడీ అంటోన్న బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఆసిన్ వైవాహిక జీవితం సాఫీగా సాగుతోందని, తన భర్త, మూడేళ్ల కూతురుతో ఆసిన్ సంతోషంగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.ఆమె తిరిగి సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని వారు అంటున్నారు.

ఇదే విషయంపై ఆసిన్‌ను ప్రశ్నించగా, ఆమె కూడా సినిమాల్లో నటించేందుకు ఇష్టపడటం లేదని బాలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి.ఏదేమైనా ఈ బ్యూటీ తిరిగి సినిమాల్లోకి వస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుతున్నారు.

కాగా పెళ్లి తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది క్యారెక్టర్ పాత్రల్లో సెటిల్ అయ్యారు.దీంతో ఇప్పుడప్పుడే క్యారెక్టర్ పాత్రలు చేసేందుకు ఆసిన్ రెడీగా లేదని తెలుస్తోంది.

అందుకే ఆమె పెళ్లి తరువాత సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చిత్ర వర్గాల టాక్.మరి ఈ వార్తలకు ఆసిన్ ఎలా స్పందిస్తుందా అని ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఆసిన్ తన కెరీర్‌లో గజిని వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఇక బాలీవుడ్‌లోనూ అమ్మడికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

#Rahul Sharma #Asin #Comeback #AsinIn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Asin Not Interested To Act In Movies Related Telugu News,Photos/Pics,Images..