బిగ్ బాస్ రన్నరప్ కు జోడీ గా కింగ్ ఖాన్ కూతురు

బాలీవుడ్ బాద్ షా,కింగ్ ఖాన్ షారూఖ్ కూతురు సుహానా ఖాన్ గురించి అందరికీ తెలిసిందే.తండ్రి తో పాటు పలు సార్లు ఐపీఎల్ మ్యాచ్ లలో కనిపించి అలరించింది.

 Asim Riaz To Pair Opposite Suhana Khan In Karan Johars Movie-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ వెండితెర పై ఎంట్రీ ఇవ్వనుంది.గత కొంత కాలం గా షారూఖ్ కూతురు సుహానా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది అంటూ మీడియా కోడై కూసింది.

కానీ ఇప్పటివరకు కూడా ఈ వార్త పై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు సరికదా తాజాగా మరో వార్త సినీ ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ వార్త ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 13 రన్నరప్ ఆసిమ్ రియాజ్ సరసన కింగ్ ఖాన్ కూతురు నటిస్తుంది అంటూ ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది.

రియాజ్ ప్రధాన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఒక సినిమా ప్లాన్ చేశారట.అయితే ఆ చిత్రంలో సుహానా ను హీరోయిన్ గా తీసుకోవాలని కరణ్ భావిస్తున్నారు.

అయితే అసలు కింగ్ ఖాన్ కూతురు ఇలా బిగ్ బాస్ రన్నరప్ కు జోడీ గా చేస్తుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ కరణ్ బ్యానర్ కాబట్టి కింగ్ ఖాన్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పబోరని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక హీరో ఆసిమ్ విషయానికి వస్తే బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినప్పటికీ కూడా ఎందరో మనసులు మాత్రం గెలుచుకున్నాడు అని చెప్పాలి.

అయితే అధికారికంగా ఇప్పటివరకు ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ లేదు.కానీ అసలు ఈ వార్తల్లో వాస్తవం తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube