ప్రస్తుతం ఉన్న ఏ రంగంలో అయినా మగాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా కొనసాగుతుంది అదే సినిమాల్లో అయితే మనం చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న సినిమాల్లో పెద్ద హీరోలు అనే వారు నటించారు అందుకే మగ ఆడ అనే తేడా ఇండస్ట్రీ తో పాటు ప్రతి రంగంలో ఉంది అలా ఉండకూడదు అనే కొంతమంది ఎప్పటికప్పుడు మేము మగ వాళ్ళ కంటే ఏం తక్కువ కాదు అని నిరూపిస్తూ వస్తుంటారు.ఒకప్పుడు అథ్లెటిక్స్ లో టాప్ రన్నర్ ఎవరు అంటే అందరూ పరుగుల రాణి పి.
టి.ఉష పేరే చెప్పేవారు కానీ కొద్దిరోజుల తర్వాత అశ్విని నాచప్ప వచ్చి పి టి ఉష నే ఓడించింది.
అశ్విని నాచప్ప పుట్టింది కర్ణాటకలో తన చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ అథ్లెటిక్స్ లో తనదైన ముద్ర వేయాలి అని అనుకొని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి అనతికాలంలోనే ది బెస్ట్ రన్నర్ గా నిలిచిపోయింది.స్పోర్ట్స్ లోనే కాదు తను సినిమారంగంలో కూడా కొన్ని సినిమాలను చేసి మెప్పించారు.
ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు అశ్విని నాచప్ప జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తీద్దామని అనుకొని అశ్విని గారిని అప్రోచ్ అయ్యారు కానీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు వేరే ఎవరో ఎందుకు అశ్విని నాచప్ప గారిని హీరోయిన్ గా తీసుకుందాం అని అనుకుని ఫిక్స్ అయిపోయి తనకు చెప్పి ఒప్పించి తనతోనే ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని వేయించారు ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది మొదటి సినిమాకి అశ్విని కి నంది అవార్డు వచ్చింది.ఆ తర్వాత కూడా తను ఇన్స్పెక్టర్ అశ్విని, ఆదర్శం, అందరూ అందరే లాంటి సినిమాల్లో నటించింది.

అయితే ఆమె రెగ్యులర్ గా సినిమాల్లో నటించనప్పటికీ కొన్ని సినిమాల్లో నటించి సినిమా రంగం పైన కూడా తనదైన ముద్ర వేసారు అశ్విని గారు.కరోభయ్యా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు స్పోర్ట్స్ నుంచి తను రిటైర్ అయిన తర్వాత వాళ్ల భర్త నిర్వహించే ఒక స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన పనులన్నీ అశ్విని గారే చూసుకుంటున్నారు.అశ్విని కి ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయిపేరు అనీష, చిన్న అమ్మాయి పేరు దీపాలి.ప్రస్తుతం అనీషా బ్యాడ్మింటన్ లో స్టేట్ లెవెల్ ప్లేయర్ గా ఆడుతూ గుర్తింపు పొందుతున్నారు.
ఎప్పటికైనా తన కూతుర్ని ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ ని చేసి తన వంతు సహాయంగా దేశానికి ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ నీ ఇవ్వడమే తన బాధ్యత అని అశ్విని గారు చెబుతుంటారు.అలాగే చిన్నమ్మాయి దీపాలి కూడా ప్రస్తుతం గోల్ఫ్ ప్లేయర్ గా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపును సాధిస్తుంది.
చాలా ఖరీదైన ఆటగా చెప్పుకునే గోల్ఫ్ ఆటలో తన ప్రతిభని చూపించడానికి దీపాలి ఎదురుచూస్తూ ఉంది.

ప్రస్తుతం అశ్వినీ నాచప్ప తన పిల్లలతో పాటు ఇంకో 32 మంది ఆడపిల్లలకు తర్ఫీదు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.అశ్విని నాచప్ప గారు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ఆడ మగ మధ్య ఎప్పుడూ తేడా ఉండకూడదు వాళ్లు చేసే అన్ని పనులు ఆడవాళ్లు కూడా చేయాలి అలాంటప్పుడే ఇంట్లో ఆడపిల్ల పుడితే చంపేసే పరిస్థితులు మారుతాయి అనే ఉద్దేశంతోనే తన పిల్లల్ని మంచి ప్లేయర్స్ నీ చేసి వాళ్లు ఇంకో పది మంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ గా నిలవాలని చూస్తుంది వాళ్ల పిల్లలనే కాకుండా ఇంకా కొంత మంది ఆడపిల్లలకి కూడా తనదైన శిక్షణతో ముందుకు నడిపిస్తుంది.ఆడపిల్లలకి తను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే బాగా చదువుకోవాలి చదువుతోపాటు ఆటలు కూడా బాగా ఆడాలి.
అలాంటప్పుడు మగ ఆడ మధ్య తారతమ్యాలు తొలగిపోతాయి అలాగే చదువు మనకి గౌరవం ఇస్తే క్రీడలు అనేవి మనకు ఇతర వ్యక్తులకు మధ్య ఉన్న తారతమ్యాన్ని తుడిచిపెట్టేసి ప్రత్యేకంగా మనం ఎదగడానికి దోహదం చేస్తుంది.అయితే ప్రస్తుతం ఆవిడ గ్రామీణ విద్య ను అభివృద్ధి చేసే పనిలో భాగంగా ఒక స్కూల్ నీ కూడా స్థాపించారు ఇప్పటికీ 560 మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుకుంటున్నారు.
అయితే అటు ఫిల్మ్ ఇండస్ట్రీ లోను, ఇటు స్పోర్ట్స్ లోనూ తనకు ప్రావీణ్యం ఉండడంవల్ల ఆడపిల్లలకి అక్కడ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తనకి తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ని అధిగమించే విధంగా ఆడపిల్లల్లో కూడా క్రీడలు ఆడే చైతన్యాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో తన పిల్లలతో పాటు వేరే ఆడపిల్లలు కూడా శిక్షణనిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.