సూపర్‌ స్టార్ హ్యాండ్ ఇచ్చాడు .. మెగాస్టార్ ఆదుకుంటాడో లేదో  

Ashwini Dutt Trying To Produce Chiranjeevi – Puri Jagannath Film -

ఒకనాటి అగ్రనిర్మాత అశ్వినీదత్ పరిస్థితి అసలేమాత్రం బాగా లేదు.కంత్రి, సైనికుడు, శక్తి వంటి భారి పరాజయాలతో ఇన్నిరోజులు పెద్ద సినిమాలు నిర్మించలేని దుఃఖ స్థితిలోకి పడిపోయారు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు ఈ నిర్మాత.

Ashwini Dutt Trying To Produce Chiranjeevi – Puri Jagannath Film--Telugu Tollywood Photo Image

మహేష్ సినిమాతో హిట్ కొట్టి, మళ్ళీ పునర్వైభవాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నించారు.

మహేష్ మాటైతే ఇచ్చాడు కాని తనకు నచ్చే కథ దొరకబడితేనే అని కండీషన్ పెట్టాడు.దురదృష్టవశాత్తు ఆశ్వినీదత్ తీసుకొచ్చిన దర్శకులు, వారు చెప్పిన కథలు, మహేష్ మెప్పుని పొందలేదు.

ప్రస్తుతం మహేష్ ని అడుగుదామనున్న అవకాశం లేకుండాపోయింది.అందుకే అశ్వినీదత్ గాలి మెగాస్టార్ చిరంజీవి వైపు మళ్ళింది.

అప్పట్లో ఆగిపోయిన చిరంజీవి – పూరి జగన్నాథ్ సినిమా , ఇప్పుడు మళ్ళీ మొదలుకానుందని, చిరంజీవి 151వ సినిమా ఇదే అని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా నిర్మించే అవకాశం పట్టేందుకు అశ్వినీదత్ ప్రయత్నాలు చేస్తున్నారట.

మరి మెగాస్టార్ అవకాశమిచ్చి ఆదుకుంటాడో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ashwini Dutt Trying To Produce Chiranjeevi – Puri Jagannath Film Related Telugu News,Photos/Pics,Images..

footer-test