మహేష్ బాబు అతడిని కరుణించాడా?  

Ashwini Dutt To Produce Mahesh Babu – Vikram Kumar Film? -

అగ్రనిర్మాత అశ్వినీదత్ గత కొంత కాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుస్టాప్ ఇప్పటికి చాలాసార్లు తెలిపింది.మొన్న తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా చెన్నై వెళ్ళి మురుగదాస్ సినిమా షూటింగ్ లో మహేష్ తో చర్చలు జరిపి వచ్చారు ఆయన.

ఈ చర్చలు మహేష్ – అశ్వినీదత్ కాంబినేషన్లో సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

Ashwini Dutt To Produce Mahesh Babu – Vikram Kumar Film-Telugu Gossips-Telugu Tollywood Photo Image

ముందు అనుకున్నట్టుగా మహేష్ – పురి జగన్నాథ్ సినిమా గురించి చర్చించి ఉంటారని అందరు అనుకున్నా, ఈ చర్చ విక్రమ్ కుమార్ గురించి జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మహేష్ – విక్రమ్ కుమార్ సినిమా నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట అశ్వినీదత్.అదే విషయం మహేష్ దగ్గర ప్రస్తావించారని, కాని మహేష్ ఇంకా ఎటువంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదని తెలియవస్తోంది.

ఇక మిగితా వార్తల్లోకి వెళితే, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న భారి ప్రాజెక్టుతో చెన్నైలో బిజిగా ఉన్నాడు సూపర్ స్టార్.ఇందులో రకుల్ ప్రీత్ తోపాటు నయనతార కూడా ఓ పాత్ర చేస్తుందని రూమర్లు వచ్చినా, అలాంటిదేమి లేదని మురుగదాస్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది ఏప్రిల్ లో, తెలుగు – తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ashwini Dutt To Produce Mahesh Babu – Vikram Kumar Film? Related Telugu News,Photos/Pics,Images..

footer-test