మహేష్‌ మూవీపై అధికారిక ప్రకటన  

Ashwini Dutt Announced Mahesh New Movie With Gautam Menon -

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు.

ఆ సినిమా మేలో రాబోతుంది.ఆ వెంటనే మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటించేందుకు మహేష్‌బాబు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

Ashwini Dutt Announced Mahesh New Movie With Gautam Menon--Telugu Tollywood Photo Image

ఆ సినిమా అధికారిక ప్రకటన సైతం వచ్చింది.ఈ రెండు సినిమాలు కాకుండా మహేష్‌బాబు ఇంకా పలు సినిమాల్లో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా మురుగదాస్‌ సినిమా తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది.

మహేష్‌బాబు, గౌతమ్‌ మీనన్‌ల కాంబినేషన్‌లో సినిమా గురించి చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.

అయితే తాజాగా ఆ సినిమాపై ఒక అధికారిక ప్రకటనను నిర్మాత అశ్వినీదత్‌ చేశాడు.తాను మహేష్‌బాబు హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించనున్నాను అని, అది 2017వ సంవత్సరంలో పట్టాలెక్కబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు.

నిర్మాతగా వెలుగు వెలిగిన అశ్వినీదత్‌ గత కొంత కాలంగా ప్రాభవాన్ని కోల్పోయాడు.అందుకే మెగా నిర్మాత అశ్వినీదత్‌కు తన వంతు సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఆయన నిర్మాణంలో ఒక సినిమాలో నటించేందుకు మహేష్‌బాబు చాలా కాలం క్రితమే ఓకే చెప్పాడు.

అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అది వచ్చే సంవత్సరం కార్యరూపం దాల్చబోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test