టీజర్ రివ్యూః 'ఆకాశవాణి' అద్బుతమైన విజువల్ వండర్‌

రాజమౌళి తనయుడు కార్తికేయ మరియు కీరవాణి తనయుడు ఇంకా కొందరు యంగ్‌ స్టర్స్ కలిసి ఆకాశవాణి అనే ప్రాజెక్ట్‌ చేస్తున్నారు అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.కార్తికేయ నిర్మాణలో ఆకాశవాణి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

 Ashwin Gangaraju Kaala Bhairava Samuthirakani Aakashavaani Teaser-TeluguStop.com

కాని సినిమా షూటింగ్‌ మద్యలో ఉన్న సమయంలో విభేదాల కారణంగా రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాణం నుండి తప్పుకుంటున్నట్లుగా ఏకంగా ప్రెస్ నోట్‌ విడుదల చేసి మరీ ప్రకటించాడు.దాంతో షూటింగ్ మద్యలో ఆగిపోతుందా.

అసలు ముందుకు వెళ్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని కార్తికేయ తప్పుకున్నా కూడా ఆకాశవాణి సినిమా ఆగిపోలేదు.

 Ashwin Gangaraju Kaala Bhairava Samuthirakani Aakashavaani Teaser-టీజర్ రివ్యూః ఆకాశవాణి’ అద్బుతమైన విజువల్ వండర్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వరుసగా ఆ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్‌ పూర్తి అయ్యాయి.

ఆకాశవాణి సినిమా నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యింది.

నేడు ఆకాశవాణి నుండి టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.ఒక అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండబోతుంది.

ఒక వైపు పల్లెటూరు మరో వైపు సిటీ వంటి సెట్టింగ్‌ లో ఈ సినిమాను చిత్రీకరించినట్లుగా టీజర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది.అంతే కాకుండా ఇదో పీరియాడిక్ మూవీగా కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆకాశవాణి సినిమా టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా లో తమిళ స్టార్‌ సముద్ర ఖని కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సంగీత దర్శకుడు కాళ భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో టీజర్ రేంజ్ మరింతగా పెరిగినట్లుగా అనిపిస్తుంది.అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అతి త్వరలో విడుదల చేస్తాం అది కూడా థియేటర్లలో అంటూ యూనిట్‌ సభ్యులు విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.

#Aakashavaani #Review #Samuthrakhani #Visual Wonder #Samuthirakani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు