ఆ రికార్డును మొట్టమొదటిసారిగా సాధించిన బౌలర్ గా అశ్విన్..!

చెన్నై లో చిదంబరం స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారతీయ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డులను నెలకొల్పుతున్నారు.ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆయన ఏకంగా 9 వికెట్లు పడగొట్టి అందరి ప్రశంసలను దక్కించుకున్నారు.

 Ashwin Became The First Bowler To Break That Record, Ashwin, Sports Updates, New-TeluguStop.com

ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ లో కూడా రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ వేస్తూ ఐదు వికెట్లు తీశారు.దీంతో ఆయన ఖాతాలో తాజాగా కొన్ని సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.

ఆయన ఇప్పటివరకు స్వదేశంలో మొత్తం 47 టెస్టుల్లో ఆడగా.23 మ్యాచులలో ప్రతిసారి ఐదు క్రికెట్స్ తీయగాలిగారు.దీంతో స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా ఆయన ఒక రికార్డును నెలకొల్పారు.89 మ్యాచులు ఆడి 22 సార్లు 5 వికెట్లు తీసి 4వ స్థానంలో నిలిచిన అండర్సన్ ని తాజాగా రవిచంద్రన్ అశ్విన్ అధిగమించారు.ప్రస్తుతం ఈ కేటగిరిలో ముత్తయ్య మురళీధరన్ (45), హెరాత్ (26), అనిల్ కుంబ్లే (25) మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నారు.

Telugu Ashwin, India England, Samanth Ashwin, Ups-Latest News - Telugu

తాజాగా ఆయన రెండో టెస్టు మ్యాచ్ లో 5 వికెట్లు తీయడంతో మరొక రికార్డు చేధించినట్లయింది.టెస్ట్ క్రికెట్ లో 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ లను అవుట్ చేసిన తొలి బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ చెక్కుచెదరని రికార్డును నెలకొల్పారు.ఆయన డేవిడ్ వార్నర్ ని 10 సార్లు అవుట్ చేశారు.

అలిస్టర్ కుక్, బెన్‌స్టోక్స్ లను 9 సార్లు, ఎడ్‌కోవాన్, జేమ్స్ అండర్సన్ లను 7 సార్లు అవుట్ చేశారు.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ లను అవుట్ చేసిన జాబితాలో అశ్విన్ తర్వాత శ్రీలంకన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ రెండవ స్థానంలో నిలుస్తున్నారు.

ఆయన తన కెరీర్లో 191 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్‌ లను అవుట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube