అశ్వగంధతో కరోనాకి చెక్... అధ్యయనంలో వెల్లడి

భారతీయ సనాతన ఆయుర్వేదం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మన చుట్టూ ఉండే మొక్కలలోనే ఎన్నో ఆయుర్వేద ఔషధ లక్షణాలు ఉన్నాయని పరోశోధకులు ఇప్పటికే నిరూపించారు.

 Ashwagandha Can Be Effective Covid-19, Corona Effect, Ayurveda Medicine, Lock Do-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఆయుర్వేదం జెనరిక్ మెడిసన్ కి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తుంది.ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్న జబ్బు మీద మాత్రమే ప్రభావం చూపించడం ఆయుర్వేద ఔషధాలకి ఉన్న ప్రత్యేకత.

ఈ నేపధ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా ఆయుర్వేద ఔషధాలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి.ఔషధాల తయారీలో మొక్కలని ఉపయోగించుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనాకి కూడా ఆయుర్వేద ఔషధం తాయారు చేయడంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడికి కోవిడ్‌ను నిరోధించే శక్తి ఉన్నట్టు తేలింది.

కరోనా వైరస్ వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రధాన ప్రొటీన్‌లను విభజించేందుకు ఉపయోగపడే ఎస్-2 ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పరిశోధన నిర్వహించారు.అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్ యాసిడ్ పెంథాల్ ఈస్ట్ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఈ ఔషధాన్ని చికిత్సలో వాడి కోవిడ్ మరణాలను తగ్గించొచ్చని పరిశోధకులు తెలిపారు.రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా అశ్వగంధకు ఇప్పటికే మంచి పేరుందని, దానికి వైరస్‌తో పోరాడే శక్తి కూడా ఉందని తాజా అధ్యయనంలో తేలిందని ఢిల్లీ ఐఐటీ బయోకెమికల్ అండ్ బయో టెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.సుందర్ అన్నారు.కాగా, ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాన్ని ప్రచురణకు అనుమతి లభించినట్టు ఢిల్లీ ఐఐటీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube