నల్లని మచ్చలకు ముడతలకు చెక్ పెట్టాలంటే ..... అశ్వగంధ

అశ్వగంధలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన చర్మ సమస్యలను పరిష్కరించటంలో సహాయపడుతుంది.అశ్వగంధను మన పూర్వీకుల కాలం నుండి ఆరోగ్య పరంగాను, బ్యూటీ పరంగాను వాడుతున్నాయి.

 Ashwagandha Beauty Benefits , Ashwagandha, Ashwagandha Oil, Wrinkles To Black Sp-TeluguStop.com

మరల ఇప్పుడు దీని వాడకం పెరిగింది.అనేక సౌందర్య ఉత్పత్తులతో ఉపయోగిస్తున్నారు.

అంతేకాక అశ్వగంధ పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది.ఈ పొడిని ఉపయోగించి నల్లని మచ్చలకు,ముడతలకు చెక్ పెట్టవచ్చు.

అశ్వగంధ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఒక స్పూన్ అశ్వగంధ పొడిలో సరిపడా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలన యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయస్సు రీత్యా వచ్చే ముడతలు రాకుండా నివారిస్తుంది.

అశ్వగంధ పొడిలో నీటిని కలిపి పేస్ట్ చేసి గాయాలకు రాస్తే త్వరగా మానతాయి.అలాగే నొప్పులు ఉన్న ప్రదేశంలో అశ్వగంధ ఆయిల్ ని రాసి మర్దన చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

అశ్వగంధలో లభించే కొన్ని స్టెరాయిడల్ కాంపౌండ్స్ శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిలను పెంపొందిస్తాయి.దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.అశ్వగంధ పొడిలో యాంటీఇంఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన వాపులను,నొప్పులను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube