మానసిక ఒత్తిడి తాళలేక మరో యువ నటుడు ఆత్మహత్య…  

Ashutosh bhakre, bollywood young actor, Suicide news, Crime news, Bollywood, Ashutosh bhakre Death news - Telugu Ashutosh Bhakre, Ashutosh Bhakre Death News, Bollywood, Bollywood Young Actor, Crime News, Suicide News

ప్రస్తుత కాలంలో కొందరు సమస్యలకి భయపడుతూ ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటూ తమ అనుకున్న వారి జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతున్నారు.అయితే ఇటీవలే బాలీవుడ్ చెందినటువంటి హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో యువ నటుడు పలు ఒత్తిళ్ల కారణంగా తన సొంత నివాసంలో ఉరి వేసుకున్న ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

 Ashutosh Bhakre Suicide Kultha Kure Kulena Mayuri Deshmukh

వివరాల్లోకి వెళితే అప్పట్లో హిందీ భాషలో ప్రసారమయ్యే “కుల్తా కురే కులేన” అనేది ధారావాహిక ద్వారా బుల్లితెరకు నటుడిగా పరిచయమైన నటుడు అశుతోష్ భక్రే తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది గమనించిన అతడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

  దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

మానసిక ఒత్తిడి తాళలేక మరో యువ నటుడు ఆత్మహత్య…-Latest News-Telugu Tollywood Photo Image

అనంతరం ఆశుతోష్ బక్రీద్ భార్య మయూరి దేశ్ ముఖ్ మరియు అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ విషయం గురించి స్పందించిన కొందరు నెటిజన్లు బాలీవుడ్లో సంభవిస్తున్న మరణాల కారణాలపై వెంటనే సినీ పెద్దలు చర్చించి నటీనటులు ఒత్తిడులకు గురవుతున్న కారణాలపై సమీక్షలు జరపాలని సూచిస్తున్నారు.అయితే ఇటీవలే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన “యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్” మృతి చెందిన సంగతి తెలిసిందే.

#Ashutosh Bhakre

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ashutosh Bhakre Suicide Kultha Kure Kulena Mayuri Deshmukh Related Telugu News,Photos/Pics,Images..