ప్రస్తుత కాలంలో కొందరు సమస్యలకి భయపడుతూ ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటూ తమ అనుకున్న వారి జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతున్నారు.అయితే ఇటీవలే బాలీవుడ్ చెందినటువంటి హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో యువ నటుడు పలు ఒత్తిళ్ల కారణంగా తన సొంత నివాసంలో ఉరి వేసుకున్న ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే అప్పట్లో హిందీ భాషలో ప్రసారమయ్యే “కుల్తా కురే కులేన” అనేది ధారావాహిక ద్వారా బుల్లితెరకు నటుడిగా పరిచయమైన నటుడు అశుతోష్ భక్రే తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇది గమనించిన అతడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఆశుతోష్ బక్రీద్ భార్య మయూరి దేశ్ ముఖ్ మరియు అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ విషయం గురించి స్పందించిన కొందరు నెటిజన్లు బాలీవుడ్లో సంభవిస్తున్న మరణాల కారణాలపై వెంటనే సినీ పెద్దలు చర్చించి నటీనటులు ఒత్తిడులకు గురవుతున్న కారణాలపై సమీక్షలు జరపాలని సూచిస్తున్నారు.అయితే ఇటీవలే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన “యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్” మృతి చెందిన సంగతి తెలిసిందే.