కారు కొన్న బిగ్ బాస్ అషురెడ్డిని తిట్టిపోస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో పాల్గొని అషురెడ్డి పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.టిక్ టాక్ వీడియోలు చేయడంతో పాటు కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేయడం ద్వారా అషురెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు.

 Actor Ashureddy Gets Trolled On Saying About Bmw Car, Ashureddy, Ashureddy Get T-TeluguStop.com

సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే అషురెడ్డి కొన్నిసార్లు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి డేటింగ్ లో ఉన్నారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఒకవైపు కామెడీ స్టార్స్ షోలో చేస్తూనే మరోవైపు హ్యాపీడేస్ అనే షో ద్వారా అషురెడ్డి రచ్చరచ్చ చేస్తున్నారు.రవితో అషురెడ్డి చేసిన ఆ షో ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యేలా ఉంది.

సోషల్ మీడియాలో సైతం రవి, అషురెడ్డి ట్రెండ్ అవుతుండటం గమనార్హం.అయితే తాజాగా అషురెడ్డి అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ లో పాల్గొని ఒక కారు ముందు ఫోటోలకు ఫోజులిచ్చారు.

అయితే తాను కారు కొన్నానని నెటిజన్లకు అనిపించేలా అషురెడ్డి ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు.

అయితే కారు నంబర్ ను మాత్రం దాచేస్తూ అషురెడ్డి ఫోజులిచ్చారు.

Telugu Ashu, Ashu Trolled, Ashu Car, Bigg Boss Show, Bmw Car, Netizens Ashu, Rah

అషురెడ్డి నిజంగానే కారు కొన్నారేమో అని భావించిన కొందరు సినీ ప్రముఖులు అషురెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు.అయితే నెటిజన్లు మాత్రం కొత్త కారును ఎవరు కొన్నారని అషురెడ్డిని ప్రశ్నిస్తున్నారు.కారు కొన్న వెంటనే నంబర్ ప్లేట్ కూడా ఇచ్చారా.? అని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కారు నంబర్ కవర్ చేయకపోతే అన్ని విషయాలను బయట పెట్టేవాళ్లమని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ashu, Ashu Trolled, Ashu Car, Bigg Boss Show, Bmw Car, Netizens Ashu, Rah

అషురెడ్డి కొత్తకారు కొన్నానని ఇచ్చిన బిల్డప్ వల్ల ఆమె పరువు పోయిందనే చెప్పాలి.అనవసరంగా అషురెడ్డి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆమె అభిమానులకు మాత్రం అస్సలు నచ్చడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube