అలియా భట్ కు సారీ చెప్పిన అషు రెడ్డి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా వెండితెరపై హీరోయిన్ గా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 Ashu Reddy With Ranbir Kapoor In Dubai ,ranbir Kapoor , Ashu Reddy , Alia Bhatt-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫోకస్ అనే సినిమా ద్వారా అషురెడ్డి హీరోయిన్ గా వెండితెర ఆరంగ్రేటం చేయనున్నారు.ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ఏదో ఒక వీడియోలను షేర్ చేయడం లేదా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉండడమే కాకుండా, ఏదోరకంగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అవుతుంటారు.

అయితే గత మూడు రోజుల క్రితం అషురెడ్డి దుబాయ్ వెళ్లిన విషయాన్ని ప్రకటించారు.ఈ క్రమంలోనే దుబాయిలో కింద పడటం వల్ల తన మోకాలికి దెబ్బ తగిలిందని ఆ దెబ్బను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ విధంగా ఈ ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు పెద్దఎత్తున ఈమె పై నెగిటివ్ కామెంట్లు చేశారు.ఆయన వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా తనదైన శైలిలో అషురెడ్డి వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఈమె దుబాయ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

ఈ సందర్భంగా అషురెడ్డి బాలీవుడ్ నటి ఆలియా భట్ కు క్షమాపణలు చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.ఇలా అలియా భట్ కి క్షమాపణలు చెప్పిన అషురెడ్డి అలియా బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.అయితే ఈమె నిజంగానే రణబీర్ కపూర్ తో ఫోటోలు దిగింది అనుకుంటే పొరపాటే.

మైనంతో తయారు చేసిన రణబీర్ కపూర్ విగ్రహం దగ్గర ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube