ఎక్స్ ప్రెస్ హరికి అషు రెడ్డి కాస్ట్ లీ గిఫ్ట్..!

ఈటీవీ పటాస్ ద్వారా పాపులర్ అయిన ఎక్స్ ప్రెస్ హరి ప్రస్తుతం స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో తన కామెడీతో అలరిస్తున్నాడు.ఎక్స్ ప్రెస్ హరి టీం లో బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి కూడా నటిస్తుంది.

 Ashu Reddy Surprise Gift To Express Hari Star Maa Comedy Stars , Ashu Reddy, Ash-TeluguStop.com

వీరిద్దరి మధ్య ఓ ట్రాక్ నడుస్తుందని తెలిసిందే.ఓ పక్క రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా ఉంటున్న అషు రెడ్డి మరోపక్క కామెడీ స్టార్స్ లో ఎక్స్ ప్రెస్ హరితో మరో ట్రాక్ మెయిన్ టైన్ చేస్తుంది.

స్కిట్స్ కోసం అషు రెడ్డితో హరి చాలా క్లోజ్ గా ఉంటున్నాడు.ఇక ఈ క్రమంలో అషు రెడ్డి లేటెస్ట్ ఎపిసోడ్ లో హరికి సర్ ప్రజ్ గిఫ్ట్ ఇచ్చింది.

ఓ సూపర్ బైక్ ను అషు రెడ్డి ఎక్స్ ప్రెస్ హరి కోసం కామెడీ స్టార్స్ వేదికగా కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది అషు రెడ్డి.ఆమె ఇచ్చిన ఆ గిఫ్ట్ కు హరి కూడా ఆశ్చర్యపోయాడు.

కామెడీ స్టార్స్ షోలో భాగంగా జరిగిన సీన్ అందరిని షాక్ అయ్యేలా చేసింది.హరితో అషు రెడ్డి లవ్ ట్రాక్ సీరియస్ మోడ్ లోకి వెళ్తుందా.

అలా కాకుండా మేము మంచి స్నేహితులం అని చెప్పడానికే అషు రెడ్డి ఇలా హరికి గిఫ్ట్ ఇచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.తన పేరెంట్స్ కూడా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని అషు రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ చూసి హరి చెప్పాడు.

అంతేకాదు అషు రెడ్డిని హగ్ చేసుకుని సర్ ప్రైజ్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube