Ashu Reddy : తండ్రి పంపిన మందు బాటిల్ తో అషు రెడ్డి రచ్చ.. కూతురుకు ఇలా కూడా ఇస్తారా?

Ashu Reddy Rushes With The Bottle Of Medicine Sent By His Father Will He Give This To His Daughter Too

సోషల్ మీడియా ద్వారా స్టార్ అషు రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి ( Ashu Reddy )తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 Ashu Reddy Rushes With The Bottle Of Medicine Sent By His Father Will He Give T-TeluguStop.com

ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.

తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ.ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత( Junior Samantha ) అని పేరు కూడా సంపాదించుకుంది.

ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Bos ) లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్( Rahul Sipliganj ) తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి ( Anchor Ravi )తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్( Big Boss Non Stop ) లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.

ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.యూట్యూబ్లో ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగ అందులో బాగా వీడియోస్ పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.అందులో తన తండ్రి తన కోసం మెన్షన్ హౌస్ మందు బాటిల్ పంపగా ఆ ఫోటో షేర్ చేస్తూ తన తండ్రి తనకు పంపించాడు అని మురిసిపోయింది.

కానీ తన తండ్రి పంపించిన గిఫ్ట్ తన తల్లికి నచ్చలేదు అంటూ పంచుకుంది.దీంతో ఆ స్టోరీ చూసి అందరూ వామ్మో కూతుర్లకు ఇటువంటి గిఫ్ట్ లు కూడా ఇస్తారా అంటూ షాక్ అవుతున్నారు.

మరికొంతమంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.ఇక ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ బాగా వైరల్ అవుతుంది.

https://instagram.com/stories/ashu_uuu/3061128493009305047?igshid=ODRjNjljZGM=

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube