Rahul Sipligunj Ariyana: సింగర్ రాహుల్ ను పొగడ్తలతో ముంచేసిన అరియానా.. ఆహా అంటూ అషురెడ్డి ఎంట్రీ?

Ashu Reddy Reaction On Ariyana Compliments For Singer Rahul Sipligunj Rrr Oscar Award

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్( Rahul sipligunj ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Ashu Reddy Reaction On Ariyana Compliments For Singer Rahul Sipligunj Rrr Oscar-TeluguStop.com

మాస్ పాటలకు ప్రాణం పోసి ఆ పాటలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో( RRR ) నాటు నాటు పాట పాడి తను గొంతుతో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేశాడు.

ఇటీవల ఈ పాట ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.కీరవాణి, చంద్రబోస్ అందించిన ఈ పాటను.కీరవాణి కొడుకు, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు.దీంతో ఈ పాటను అందించిన ప్రతి ఒక్కరు ఆస్కార్ అవార్డు అందినందుకు సంతోషంలో మునిగారు.

ప్రతి ఒక్కరు వీరి టాలెంట్ గుర్తించి ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.

అయితే తాజాగా రాహుల్ ను ఆయన ఫ్రెండ్, టాలీవుడ్ ఆర్టిస్ట్ అరియానా ( Ariyana ) కూడా పొగడ్తలతో ముంచింది.

దీంతో వెంటనే అషు రెడ్డి ( Ashu reddy ) కాస్త వెటకారంగా స్పందించినట్లు అనిపించింది.నిజానికి బుల్లితెర ఆర్టిస్టులు అషు రెడ్డి, అరియానా ల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లకు మాత్రం వీరి పరిచయం పూర్తిగా తెలుసు.

ఎందుకంటే వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ అలా ఉంటుంది కాబట్టి.యూట్యూబ్ యాంకర్ గా అరియానా పరిచయం అవ్వగా.డబ్స్మాష్ వీడియోలతో అషు పరిచయమయ్యింది.

ఇక వీరిద్దరికీ బిగ్ బాస్ లో వేరే వేరే సీజన్లలో కూడా అవకాశం వచ్చింది.ఇక ఇద్దరూ రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలు కూడా చేశారు.

ఇక ఇద్దరికీ నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం కూడా వచ్చింది.ఆ సమయంలో వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది.అప్పటినుంచి ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లడం, కలిసి ఫోటోలు దిగడం, రచ్చ రచ్చ చేయటం మొదలుపెట్టారు.ఒకరి వ్యక్తిగత విషయాలు మరొకరు తెలుసుకునే అంత క్లోజ్ అయ్యారు.

అయితే అషు సింగర్ రాహుల్ తో ఇప్పటికీ ప్రేమాయణం లో ఉంది అని బాగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అప్పుడప్పుడు అషు ప్రవర్తన బట్టి కూడా వారి మధ్య నిజంగా లవ్ నడుస్తుందేమో అని అనుమానాలు రాక తప్పదు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా అరియానా తన సోషల్ మీడియా వేదికగా రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు అందుకున్నందుకు అతనిని బాగా గొప్పగా పొగిడింది.

ఏకంగా ప్రశంసలల్లో ముంచేసింది.అంతే కాకుండా రాహుల్ నటించిన రంగమార్తాండ సినిమా గురించి కూడా ఒక చిన్నపాటి ప్రమోషన్ చేసింది.అయితే వెంటనే ఆ కామెంట్ కు అషు రెడ్డి ఆహా అంటూ వెటకారంగా స్పందించినట్లు అనిపించింది.

దీంతో నెటిజన్స్ అషు ను ట్యాగ్ చేసి వచ్చేసావా అషు అనటంతో వెంటనే మరో నెటిజన్.ఎందుకు రాదు.రాహుల్ ఉన్నాడుగా వచ్చేస్తుంది అంటూ కామెంట్ చేశారు.అంటే రాహుల్ గురించి ఏ వార్త వచ్చినా కూడా అషు స్పందిస్తుంది అని క్లియర్ గా అర్థమవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube