ఆకలేసినప్పుడు నేను అలానే ఉంటాను: బిగ్ బాస్ అషూ పాప...!

అషూ రెడ్డి.బిగ్ బిగ్ బాస్ 3 సీజన్ లో తళుక్కుమని మెరిసిన ఈ బ్యూటీ జూనియర్ సమంత అంటూ నెటిజన్స్ నెత్తిన పెట్టుకున్నారు.

 Ashu Reddy Reacts About Hungryness, Jabardasth Show, Ashu Reddy Instagram, Ashu-TeluguStop.com

బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఈవిడ కేవలం డబ్ స్మాష్ లు చేస్తూ ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది.ఆ సమయంలో కూడా ఈవిడ ఓ రేంజ్ లో పాపులర్ అయింది.

అయితే బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మొదటి రెండు వారాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత మాత్రం తన సత్తా ఏంటో నిరూపించింది.హౌస్ లో అందరితో కలిసిపోయి తన అందచందాలతో, డాన్స్ తో కుర్రకారుకి పిచ్చేక్కించింది.

అయితే బిగ్ బాస్ సీజన్ ముగిశాక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ బాగా లావు అయ్యింది.అందుకు కారణం డిప్రెషన్ లోకి వెళ్లడం, లవ్ ఫెయిల్యూర్ లాంటి విషయాలని సోషల్ మీడియాలో తెగ మాట్లాడేస్తున్నారు.

అయితే అందులో నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి తిరిగి మళ్ళీ తన పాత రూపాన్ని ఎంతో కష్టపడి తెచ్చుకుంది.ఇప్పుడు మళ్లీ జూనియర్ సమంతల కనబడుతోందని నెటిజన్స్ అంటున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో తాజాగా అషూ పాప జబర్దస్త్ స్టేజ్ మీద తళుక్కుమంది.

తాగుబోతు రమేష్ టీంలో స్కిట్ చేయడానికి ఓ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

అందులో అషూ ను చూసి తెలుగు టీవీ ప్రేక్షకులు నిజంగా ఫిదా అయిపోయారు.ఆవిడ నటించిన ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో కూడా ఓ రేంజ్లో వైరల్ కూడా అయింది.

ఇకపోతే తాజాగా అషూ రెడ్డి తాను కూడా ఇంతే అంటూ ఓ పోస్టు చేసింది.ఈ మధ్య కాలంలో కొంత మంది ఏదైనా వారికి సంబంధించిన విషయాన్ని అట్టముక్క పై రాసి తెలిపేవారు ఎక్కువైపోయారు.

అయితే ఇలాంటి బ్యాచ్ ఫోటోలకు సంబంధించి ఓ ఫోటోను మరి వెతికి పట్టుకొని అషూ పోస్ట్ చేసింది.అందులో ఆకలి వేసిన సమయంలో కాస్త కొంచెం పిచ్చెక్కిపోతుంది… సారీ అంటూ ఒక అమ్మాయి అట్ట ముక్క పట్టుకొని ఉన్న ఫోటోను పోస్ట్ చేసి తాను కూడా ఇంతే అంటూ చెప్పుకొచ్చింది.

నేను కూడా అలానే సారి చెప్తాను అంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube