ప్రెగ్నెంటైనా అషు రెడ్డి... కాలితో తన్నీ గేంటేసిన తల్లి.. వీడియో వైరల్!

Ashu Reddy Pregnant Her Mother Kicked Out Video Goes Viral

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది వారి నైపుణ్యాన్ని బయటపెట్టి ఇండస్ట్రీలోకి సులభంగా ఎంట్రీ ఇస్తున్నారు.ఇలా ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకోని ప్రస్తుతం బుల్లితెర వెండితెర పై ఎంతో అద్భుతమైన అవకాశాలను అందుకోని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

 Ashu Reddy Pregnant Her Mother Kicked Out Video Goes Viral-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో అషు రెడ్డి ఒకరు.ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను చేసి జూనియర్ సమంతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చారు.

 Ashu Reddy Pregnant Her Mother Kicked Out Video Goes Viral-ప్రెగ్నెంటైనా అషు రెడ్డి… కాలితో తన్నీ గేంటేసిన తల్లి.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఎన్నో అవకాశాలు రావడంతో ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నారు.

బుల్లితెరపై ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.ఈ క్రమంలోనే అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.

ఇక గత కొద్దిరోజుల నుంచి ఈమె వరుసగా యూట్యూబ్ ఛానల్ లో పలు వీడియోలను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇటీవలే దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చిన ఈమె అక్కడ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లను కొనుగోలు చేయడం అవి తన తల్లికి చూపించడంతో వాటిని తన తల్లి తగలబెడుతూ ఉన్నటువంటి ఒక వీడియోను షేర్ చేశారు.తాజాగా మరొక ప్రాంక్ వీడియో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ ఫ్రాంక్ వీడియోలో భాగంగా అషు రెడ్డి ప్రెగ్నెంట్ అంటూ తన తల్లికి ఏడుస్తూ చెప్పడంతో తన తల్లి తన పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో తన తల్లి ఎంతో కోపంతో నిజం చెప్పు ఏం చేసావ్ అని అడగగా ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకున్నాను పాజిటివ్ అని తేలిందని చెప్పడంతో ఏకంగా తన పై చేయి చేసుకోవడమే కాకుండా, కాలితో తంతూ బయటకు గెంటేసినంత పని చేసింది.ఇక ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతానని తన తల్లి ఫోన్ తీసుకొని తన తండ్రికి ఫోన్ చేయగా వెంటనే అషు రెడ్డి తన స్నేహితులు తన తల్లికి అసలు విషయాన్ని తెలిపారు.

అమ్మ నేను చెప్పేది విను ఇది కేవలం ఫ్రాంక్ వీడియో నిజం కాదు నాన్నకు ఫోన్ చేయకు అంటూ ముందుగా అక్కడ సెట్ చేసిన కెమెరాలను చూపించారు.ఇలా కెమెరాలన్నింటిని చూపించడంతో తన తల్లి నమ్మి మరొకసారి తనపై చేయి చేసుకుని ఇలాంటి విషయాలలో అబద్ధాలు చెబుతారా అంటూ కోప్పడింది.ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే బాగుండదు అంటూ తనకు గట్టిగా గడ్డిపెట్టినట్టు తెలుస్తోంది.

#Ashu Mother #Ashu Reddy #Bigg Boss Ashu #Pregnant #Mother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube