పవన్ కళ్యాణ్ తో తనని లింక్ పెట్టి ప్రచారం చేస్తే తాట తీస్తా అంటున్న ఆషురెడ్డి

జూనియర్ సమంత అనే ఇమేజ్ తో టాలీవుడ్ లో భాగా పాపులర్ అయిన అమ్మాయి ఆషూరెడ్డి.ఈ అమ్మాయి సమంత మాదిరిగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది.

 Aashu Reddy Fires On Trolls Over Pawan Kalyan, Tollywood, Telugu Cinema, Bigg B-TeluguStop.com

అదే గుర్తింపుతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 3లోకి కూడా ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది.బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత ఆషూరెడ్డి ఫేమ్ అమాంతం పెరిగిపోయింది.

సినిమాలలో చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే గత కొంతకాలంలో సింగర్, బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆషూరెడ్డి ప్రేమాయణం సాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ విషయాన్ని రహులు స్వయంగా ఇద్దరం డేట్ లో ఉన్నామంటూ ప్రకటించాడు.అయితే ఆషూ రెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పవన్ కళ్యాణ్ పేరుని ఆమె తన వీపు మీద టాటూగా వేయించుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో ముచ్చటించే క్రమంలో ఓ అభిమాని మీరు పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్యగా ఉండటానికి ఇష్టమేనా అంటూ అడిగేశాడు.

దానికి ఆమె కూడా ఏదో యాదృస్చికంగా ఇష్టమే అని మాట్లాడింది.అయితే ఈ విషయాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేసే విధంగా సోషల్ మీడియా, టీవీ చానల్స్ లో కథనాలు ప్రసారం అయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ టార్గెట్ చేసే ఒక వర్గం మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.దీంతో ఆ వార్తలు ఆషూ రెడ్డికి కోపం తెప్పించాయి.

నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాయడం ఎంత వరకు కరెక్ట్, పవన్ ను చేసుకుంటానని నేను చెప్పానా అంటూ ఫైర్ అయింది.పిచ్చిపిచ్చి రాతలు రాస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చింది.

తప్పుడు వార్తలు రాసి అనవసరంగా తన ఇమేజ్ తీయొద్దంటూ అశు రెడ్డి సీరియస్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube