డాన్స్ స్టెప్ లతో రెచ్చిపోతున్న అషు రెడ్డి.. ఇంకెంత అరాచకం చేస్తుందో అంటూ కామెంట్స్?

అషు రెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ బుల్లితెరలో, సోషల్ మీడియాలలో అందరి దృష్టిలో పడింది.ఎప్పుడైతే రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందో అప్పటినుండి మరింత రెచ్చిపోతుంది.

 Ashu Reddy Dance In Bb Jodi Dance Promo Netizens Comments Details, Ashu Reddy ,-TeluguStop.com

నిజానికి అంతకుముందే ఈ బ్యూటీ ఒక బోల్డ్ అని అర్థమయింది.డబ్స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత గా అందరి కంటిలో పడింది.

దీంతో ఆమెకు నితిన్ నటించిన ఓ సినిమాలో అవకాశం కూడా వచ్చింది.అందులో సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది.ఆ తరువాత బిగ్ బాస్ లో అడుగుపెట్టగా అక్కడ తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.అయితే హౌస్ లో ఉన్నంతకాలం అంతగా షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు.

కానీ ఎప్పుడైతే హౌస్ నుండి బయటికి వచ్చిందో అప్పుడు బాగా రెచ్చిపోయింది.

పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఆయన పేరును ప్రైవేట్ ప్లేస్ లో టాటూగా వేయించుకొని అందరి దృష్టిలో పడింది.

ఆ సమయంలో రాహుల్ సిప్లిగంజ్ తో కూడా బాగా తిరుగుతూ కనిపించింది.ఆ తర్వాత బుల్లితెరపై అవకాశాలు రావటంతో అక్కడే సెటిల్ అయింది.యాంకర్ గా, లేడి కమెడియన్ గా చేసి ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

అయితే గతంలో ఓసారి రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది.ఇక ఆ ఇంటర్వ్యూలో వీరిద్దరి మధ్య సాగిన బోల్డ్ మాటలు బాగా వైరల్ అయ్యాయి.ఆ తర్వాత మరోసారి అషు రెడ్డి నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.

ఇందులో కూడా బాగా రచ్చ చేసింది.ఇక ఈ షో నుండి బయటికి వచ్చాక ఓ సినిమాలో కూడా నటించింది.

అషు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.చాలావరకు ఇంట్లో కంటే నెట్టింట్లో గడిపేస్తుంది.సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక ఇటీవలే రాంగోపాల్ వర్మతో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేయగా.

ఇందులో వర్మ తన కాళ్లు పట్టుకొని ముద్దు పెట్టుకోవడం తనతో బోల్డ్ గా మాట్లాడటం చాలా వైరల్ అయింది.

దీంతో ఆ సమయంలో ఈమెను బాగా ట్రోల్స్ చేశారు.ఫేమ్ కోసం ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉంటావు అని కామెంట్లు చేశారు.ఇక ఇవి వేసుకునే బట్టలు మాత్రం అలా ఘోరంగా ఉంటాయి.

చాలావరకు తన సీక్రెట్ పార్ట్ లు బయటపడేలా చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె స్టార్ మా లో బీబీ జోడీ డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఇందులో మెహబూబ్ తో జోడి కలిపి బాగా డాన్సులు చేస్తుంది.తాజాగా తమకు సంబంధించిన ఒక డాన్స్ ప్రోమో విడుదల అయింది.ఇందులో కూడా తను పొట్టి స్కట్ లో కనిపించగా ఆ వీడియోని చూసి నెటిజన్స్ మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం.

నార్మల్ గానే బట్టలు ఉండవు ఈమెకి.ఇక డాన్స్ అంటే ఇంకా ఎంత అరాచకం ఉంటుందో.

ఈ షోస్ పెట్టే బదులు యూజ్ అయ్యేది పెట్టండి.ఆల్రెడీ వాళ్లకు ఫేమ్, పాపులారిటీ ఉంటది.

మళ్ళ వాళ్లకే అమౌంట్ ఇచ్చి మరి అవసరమా ఈ షోస్ చేయడం.అసలు ఈ షోస్ పై ఇంట్రెస్ట్ లేదు అని కామెంట్ పెట్టగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube