ఆడి కార్ కొన్న అషు రెడ్డి.. ఇన్నీ పైసల్ ఎక్కడ నుండి వస్తున్నాయంటూ ప్రశ్న?

Ashu Reddy Bought An Audi Car The Question Is Where Are These Money Was Coming From

ఈమధ్య సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు సెలబ్రెటీలుగా మారుతున్నారు.చాలావరకు టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియా స్టార్ లుగా మారి వెండితెర, బుల్లితెర పై ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంటున్నారు.

 Ashu Reddy Bought An Audi Car The Question Is Where Are These Money Was Coming From-TeluguStop.com

ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా స్టార్లు బుల్లితెరలో అవకాశాలు అందుకున్నారు.ఇక మరో సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి కూడా సెలబ్రిటీ హోదాను అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

ప్రస్తుతం బుల్లితెరపై అషు రెడ్డి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.చూడటానికి అచ్చం సమంతల ఉండటంతో ఏకంగా సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.పైగా వెండితెరపై ఓ సినిమాలో కూడా నటించింది.

 Ashu Reddy Bought An Audi Car The Question Is Where Are These Money Was Coming From-ఆడి కార్ కొన్న అషు రెడ్డి.. ఇన్నీ పైసల్ ఎక్కడ నుండి వస్తున్నాయంటూ ప్రశ్న-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక బుల్లితెరలో ప్రసారమైన వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం కూడా అందుకుంది.ఇక ఈ షోతో మరింత పరిచయం పెంచుకుంది అషు రెడ్డి.

ఈ షో తర్వాత బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ షో లలో అవకాశాలు అందుకుంది.స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందింది.

Telugu Actress, Anchor Ravi, Ashu Reddy, Ashu Reddy Audi Car, Audi Car, Bigg Boss, Comedy Stars Show, Film Industry, Money, Pawan Kalyan, Ram Gopal Varma, Tollywood-Movie

అంతేకాకుండా గతంలో యాంకర్ రవి తో కలిసి ఓ ఎంటర్టైన్మెంట్ షోలో యాంకర్ గా కూడా చేసింది.ఇటీవలే రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరింత రచ్చ చేసింది.వర్మతో కలిసి బోల్డ్ మాటలతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Telugu Actress, Anchor Ravi, Ashu Reddy, Ashu Reddy Audi Car, Audi Car, Bigg Boss, Comedy Stars Show, Film Industry, Money, Pawan Kalyan, Ram Gopal Varma, Tollywood-Movie

నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

Telugu Actress, Anchor Ravi, Ashu Reddy, Ashu Reddy Audi Car, Audi Car, Bigg Boss, Comedy Stars Show, Film Industry, Money, Pawan Kalyan, Ram Gopal Varma, Tollywood-Movie

ఎందుకంటే పవన్ పేరును ప్రైవేట్ ప్లేస్ లో టాటూ గా వేయించుకుంది.ఆయనతో దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.కొన్ని కొన్ని సార్లు పవన్ కళ్యాణ్ గురించి ఓపెన్ కామెంట్స్ కూడా చేసింది అషు రెడ్డి.ఇదిలా ఉంటే తాజాగా తాను ఓ ఆడి కార్ కొన్నది.

ఇక ఆ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

ప్రస్తుతం తన కారు ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా తన ఫాలోవర్స్ బాగా లైకులు చేస్తున్నారు.

అంతేకాకుండా కామెంట్లలో కంగ్రాట్స్ అని కూడా చెబుతున్నారు.ఇక అందులో ఓ నెటిజెన్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇన్ని పైసలు ఎక్కడినుంచి వస్తున్నాయి అక్క అని ప్రశ్నించాడు.కొంచెం మాకు కూడా చెప్పండి ప్లీజ్ అంటూ మా లైఫ్ లో ఉన్న బాధలు క్లియర్ చేసుకుంటామని మెసేజ్ చేయగా వెంటనే అషు రెడ్డి తనకు హెల్ప్ చేస్తానని స్పందించింది.

#Ashu Car #Pawan Kalyan #Bigg Boss #Money #Anchor Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube