ఎక్స్ ప్రెస్ హరి పరువు ఘోరంగా తీసిన అషు రెడ్డి.. నెట్టింట్లో కామెంట్స్ వైరల్!

Ashu Reddy And Express Hari Satires On Latest Photoshoot Netizens Are Commenting

తెలుగు బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షో గురించి మనందరికీ తెలిసింది.ఇందులో పలువురు జబర్దస్త్ కమెడియన్, అలాగే పటాస్ కమెడియన్స్ ఈ షోలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నారు.

 Ashu Reddy And Express Hari Satires On Latest Photoshoot Netizens Are Commenting-TeluguStop.com

ఈ షోలో కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి, సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ అషురెడ్డి జంట గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంట సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది.

అషు పేరుని ఎక్స్ ప్రెస్ హరి టాటూ వేయించుకోవడం, అలాగే అషు హరి కోసం బైకును కొనివ్వడం, టాటూ వేయించుకున్నాడు అని హరి ని అషు లాగిపెట్టి కొట్టడం ఇలా చిన్న చిన్న విషయాలతోనే ఈ జంట బాగా పాపులర్ అయ్యింది.

 Ashu Reddy And Express Hari Satires On Latest Photoshoot Netizens Are Commenting-ఎక్స్ ప్రెస్ హరి పరువు ఘోరంగా తీసిన అషు రెడ్డి.. నెట్టింట్లో కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా కామెడీ స్టార్ లో ఎక్స్ ప్రెస్ హరి ని కాస్త టాటూ హరి అంటూ షోలోని టీమ్ మెంబర్స్ కూడా ట్రోలింగ్స్ చేయడం ప్రారంభించారు.

ఇక వీరి వద్ద కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా? లేక లవ్ ఉందా? లేకపోతే కేవలం స్కిట్ వరకు మాత్రమే అలా ఉంటారా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.కానీ ఈ జంట చేసే పనుల ద్వారా పాపులర్ అవుతూనే ఉన్నారు.

బుల్లితెరపై ప్రసారమవుతున్న హ్యాపీ డేస్, కామెడీ స్టార్ షో లతో వీరిద్దరూ మరింత పాపులర్ అవుతున్నారు.ఇకపోతే అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే వింత ఫోటో షూట్ ల గురించి మనందరికీ తెలిసిందే.

తాజాగా అషు రెడ్డి చీపురుకట్టను చేతపట్టుకుని వింతగా ఫోజులు ఇచ్చింది.ఈ ఫోటో పై ఎక్స్ ప్రెస్ హరి సెటైర్లు వేశాడు.పుష్ప సినిమాలో శ్రీవల్లి టైపులో అషు రెడ్డి పలు పోజులు ఇచ్చింది.పాత్రలు తోమినట్టుగా, చీపురు పట్టి కూర్చున్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇక ఈ ఫోటోలపై హరి సెటైర్లు వేస్తూ చాలా నాచురల్ గా ఉన్నావు రా అని అనగా.నువ్వు చీపురు పట్టుకుంటే చీపురు కే అందం వస్తుంది అంటూ రివర్స్ లో పంచులు వేసింది అషురెడ్డి.

ఈ కౌంటర్ పై గల్లీ బాయ్స్ రియాజ్ స్పందిస్తూ అయ్యా.షూటింగ్ ఎప్పుడు మానేసావు అంటూ హరి పై పంచ్ వేసాడు.

#Express Hari #Express Hari #Ashu #Actress #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube