వైఎస్సార్ బయోపిక్ యాత్రలో విజయమ్మగా నటించింది ఎవరో తెలుసా.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!     2019-01-08   10:07:25  IST  Sai Mallula

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదలవుతోంది. ఈ చిత్రంలో వైఎస్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌ చూస్తే వైఎస్‌ పాత్రలో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారంటున్నారు సినీ అభిమానులు.

Ashrita Vemuganti AS YS Vijayamma In YSR Biopic Yatra

ఇందులో వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు. మరి వైఎస్‌ సతీమణి విజయమ్మ పాత్రను ఎవరు చేశారు? అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. తాజాగా ‘యాత్ర’ బృందం వైఎస్‌ విజయమ్మ పాత్రధారి అశ్రిత వేముగంటి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ చూసినవాళ్లు అచ్చం విజయమ్మలాగే అశ్రిత ఉందంటున్నారు. ‘బాహుబలి 2’లో అనుష్క వదిన పాత్రలో నటించారు అశ్రిత. ఆమె గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు ఇవే.

Ashrita Vemuganti AS YS Vijayamma In YSR Biopic Yatra-YS Rajasekhar Reddy Role Yatra

అనుష్క శెట్టి వదినగా బాహుబలి చిత్రంలో నటించింది అనుష్క కంటే వయసులో చిన్నదైన 27 ఏళ్ల “ఆశ్రిత”. భరతనాట్యం, కూచిపూడి నాట్యంలో తనకంటూ ప్రతిభ సాధించింది “ఆశ్రిత”. అయితే ఆమెకు సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఓసారి ఆమె ఓ ప్రదర్శన ఇస్తున్నారు. ఆ ప్రదర్శన వీక్షించే ఆడియన్స్ లో రాజమౌళి కుటుంభం కూడా ఉంది. ఆ పెర్ఫార్మెన్స్ అయిపోయిన నెలకు రాజమౌళి కొడుకు కార్తికేయ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీకు సినిమాలో నటించే ఉద్దేశ్యం ఉందా అని. అలా అడిగితె అవకాశం ఎవరు వదులుకుంటారు చెప్పండి! అందులోను బాహుబలి సినిమా.అందుకే ఆశ్రిత ఓకే చెప్పేసింది.

Ashrita Vemuganti AS YS Vijayamma In YSR Biopic Yatra-YS Rajasekhar Reddy Role Yatra

అలా తన నాట్యమే తనకు అవకాశాన్ని సంపాదించిపెట్టింది అని ఆశ్రిత చెప్పుకొచ్చింది. ఆశ్రిత ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పింది. అంతేకాకుండా వివిధ దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇవ్వబోతోంది.