అశోక చెట్టు ఇంటిలో ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?       2018-04-27   02:22:03  IST  Raghu V

భూప్రపంచంలో ఎన్నో వేలాది చెట్లు ఉన్నా కేవలం కొన్ని చెట్లను మాత్రమే హిందువులు పూజిస్తారు. వాటిని మన పూర్వీకులు దేవతా వృక్షాలుగా భావించి పూజలు చేస్తున్నారు. వాటిలో అశోక చెట్టు ఒకటి. మన పురాణాల్లో ఈ చెట్టు ప్రస్తావన కూడా ఉంది. నిజానికి అశోక అనే పదం సంస్కృత పదం. అశోక అంటే బాధలు లేకుండా దుఃఖాలను తగ్గించేదని అర్ధం. ఈ చెట్టును కొంతమంది ఇంటిలో వేసుకోకూడదని అంటారు. అయితే కొంతమంది చెట్టును ఇంటిలో వేసుకోవటం వలన కొన్ని లాభాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అశోక చెట్టుకు ప్రతి రోజు నీటిని పోయటం వలన మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల ఆడవారు ప్రతి రోజు అశోక చెట్టుకు నీటిని పోస్తే మంచిది.

అశోక చెట్టును ఇంటికి ఉత్తరం వైపున వేస్తె ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తే ఎన్నో లాభాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతి రోజు అశోక చెట్టుకు నీటిని పోయటం మాత్రమే మానకూడదు. పెళ్లి అయిన దంపతులు అశోక చెట్ల వేళ్ళను దిండు కింద పెట్టుకొని పడుకుంటే వారి సంసారంలో ఎటువంటి కలతలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు.

అశోక చెట్టు వేళ్లను శుభ్రం చేసుకొని దేవుడి గదిలో పెట్టుకుంటే ఇంటికి ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి.అశోక చెట్టు కింద ప్రతి రోజు నెయ్యి,కర్పూరంతో దీపం వెలిగిస్తే ఇంటిలోని వారందరు సుఖ సంతోషాలతో ఉండటమే కాకుండా వారికీ అదృష్టం కూడా కలిసి వస్తుంది.