Ashok Leyland Tanzania : టాంజానియా దేశంలో అశోక్ లేలాండ్ వాహనాలు.. పోలీసులకే స్పెషల్!

ఇప్పటికే భారతదేశానికి చెందిన మహీంద్రా ఇంకా తదితర కంపెనీల వాహనాలు ఇతర దేశాలలోని పోలీసుల వ్యవస్థలో భాగమయ్యాయి.తాజాగా దేశీయ వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ కూడా ఈ జాబితాలో జాయిన్ అయిపోయింది.

 Ashok Leyland Vehicles In Tanzania.. Special For Police Tanzania, Ashok Leyland,-TeluguStop.com

అశోక్ లేలాండ్ కంపెనీ టాంజానియా దేశ పోలీసు బలగాల కోసం 150 వాహనాల వరకు ట్రాన్స్‌పోర్ట్ చేసింది.వీటిలో పోలీసు సిబ్బంది ప్రయాణించడానికి కావాల్సిన బస్సులు, పోలీస్ ట్రూఫ్ క్యారియర్స్, అంబులెన్సులు, రికవరీ ట్రక్స్, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి.

వాస్తవానికి కొన్ని నెలల క్రితం నుంచే అశోక్ లేలాండ్‌ తయారుచేసిన 475 వాహనాలను టాంజానియా పోలీస్ బలగాలు ఉపయోగిస్తున్నాయి.కాగా ఇప్పుడు అశోక్ లేలాండ్ సంస్థ మరిన్ని వాహనాలను టాంజానియాకి సరఫరా చేస్తునట్లుగా వెల్లడించింది.

అంటే ఇప్పుడు మొత్తంగా టాంజానియా పోలీసులకు ఇప్పుడు 625 అశోక్ లేలాండ్ వాహనాలు ఉన్నాయి చెప్పొచ్చు.వాణిజ్య వాహనాల తయారీదారు అశోక్ లేలాండ్.టాంజానియా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ వాహనాలు పంపించారు.

Telugu Ashok Leyland, India, Kilimanjaro, Tanzania-Latest News - Telugu

ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం లాంగ్ టర్మ్ సాఫ్ట్ డెట్ ఇవ్వడం ద్వారా టాంజానియా దేశం వీటిని కొనుగోలు చేయగలిగింది.ఈ డీల్‌కు ఆర్థిక సహాయం అందించబడింది.భవిష్యత్తులో మరిన్ని వాహనాలను టాంజానియాకి తరలిస్తామని అశోక్ లేలాండ్ వెల్లడించింది.టాంజానియా ఖండంలో ఎత్తైన పర్వతం కిలిమంజారో ఉంది.ప్రపంచంలోని రెండవ లోతైన సరస్సు టాంగన్యికాకి ఇది నిలయం.ఈ తూర్పు ఆఫ్రికా దేశం ఆర్థికంగా వెనుకబడిన దేశం.అందుకే 150 వాహనాలను కూడా కొనుగోలు చేయలేక అప్పుగా తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube