గెహ్లాట్‌కు భవితవ్యం ఏమిటి.. కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతుంది!

రాజస్థాన్‌లో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుతున్నాయి.సోనియా గాంధీని కలిసిన అనంతరం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

 Ashok Gehlot Wont Contest Elections Congress, Congress President Polls, Congress-TeluguStop.com

సోనియా గాంధీతో సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు.సమావేశం అనంతరం బయటకు వచ్చిన గెహ్లాట్ మీడియాతో ముచ్చటించారు.కాంగ్రెస్ అధ్యక్షుడితో మాట్లాడాను.“నేను ఎప్పుడూ నమ్మకమైన సైనికుడిగా పనిచేశాను.శాసనసభా పక్ష సమావేశం రోజున జరిగిన ఘటన అందరినీ కలచివేసింది.నేనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని భావించి, ఆమె క్షమాపణలు చెప్పాను” అయితే రాజస్థాన్ ఏర్పడ్డ సంక్షోభానికి గెహ్లాట్ తెరదించుతారా? లేదా రాజకీయాలు పూర్తిగా దూరమవుతారా? అనేది ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ప్రశ్న

గెహ్లాట్‌కు భవిష్యత్తు అవకాశాలు ఏమిటి

అశోక్ గెహ్లాట్ స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సచిన్ పైలట్‌కు మద్దతు ఇచ్చే అవకాశం.పైలట్‌ను ముఖ్యమంత్రిని చేసి, తన సన్నిహిత ఎమ్మెల్యేను ఉప ముఖ్యమంత్రిని చేయవచ్చు.ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, గెహ్లాట్ అద్యక్ష ఎన్నికల బరిలో ఉండవచ్చు.

గెహ్లాట్ తప్పులను మన్నించి కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉంది.అశోక్ గెహ్లాట్‌ను సీఎంగా కొనసాగించే అవకాశం ఉంది.

సచిన్ పైలట్ ను దేశ రాజకీయాల్లోకి తీసుకోవచ్చు.ఇద్దరి మధ్య వివాదం పరిష్కారం కాకపోతే, మూడో వ్యక్తిని రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేసే అవకాశం కూడా ఉంది.

Telugu Ashok Gehlot, Congress, Digvijaya Singh, Rajasthan, Shashi Tharoor-Politi

ఇంతకీ ఏం జరిగింది

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరింది.ఇందుకోసం గెహ్లాట్‌కు బదులు మరొకరిని రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది.దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందే రాష్ట్రంలో రచ్చ రచ్చ జరిగింది.గెహ్లాట్ అనుకూల ఎమ్మెల్యేల రాజీనామాలపై చర్చ జరిగింది.ఈ ఎమ్మెల్యేలు హైకమాండ్ పంపిన పరిశీలకుల సమావేశానికి కూడా హాజరుకాకుండా విడిగా సమావేశమయ్యారు.ఈ గొడవ కారణంగా గెహ్లాట్‌పై హైకమాంగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

రెండు రోజుల గొడవ తర్వాత మంగళవారం అశోక్ గెహ్లాట్ సోనియా గాంధీతో ఫోన్‌లో మాట్లాడి గురువారం సమావేశమై క్షమాపణలు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube