కౌబాయ్ గెటప్ లో మహేష్ మేనల్లుడు... సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా

ఈ మధ్య స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి వారసుల దిగుమతి ఎక్కువైంది.మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఆయన ఇమేజ్ ఉపయోగించుకొని ఇప్పటికి 12 మంది హీరోల వరకు వచ్చారు.

 Ashok Galla Cowboy Getup For New Movie, Tollywood, South Cinema, Super Star Mahe-TeluguStop.com

రీసెంట్ గా కొనెదల పవన్ తేజ్ అనే కుర్రాడు కూడా మెగాస్టార్ తన బాబాయ్ అంటూ హీరోగా ఎంట్రీ అయ్యాడు.ఇక సూపర్ స్టార్ కృష్ణ నటవారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు.

రమేష్ బాబు ప్రస్తుతం సినిమాలు వదిలేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ని రూల్ చేస్తున్నాడు.

మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ తో అతని చెల్లెలు భర్త సుదీర్ బాబు హీరోగా పరిచయం అయ్యాడు.తనకంటూ సొంతగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి సుదీర్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబు అక్క కొడుకు గల్లా జయదేవ్ వారసుడు గల్లా అశోక్ సూపర్ స్టార్ మహేష్ బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకొని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా అశోక్ ని లాంచ్ చేయడానికి తండ్రి గల్లా జయదేవ్ నిర్మాతగా మారిపోయాడు.

ఇదిలా ఉంటే ఇన్ని రోజులు సైలెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నుంచి ప్రీలుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.టైటిల్ ఎనౌన్స్ సందర్భంగా ఈ ప్రీలుక్ పోస్టర్ లాంచ్ చేశారు.

ఇందులో గల్లా అశోక్ కౌబాయ్ గెటప్ లో కనిపించడం విశేషం.సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులకి కౌబాయ్ గెటప్ అనేది ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో అనే బ్రాండ్ ని మెయింటేన్ చేయడం కోసం మహేష్ ఫాన్స్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం గల్లా అశోక్ కూడా అదే గెటప్ లో పరిచయం కావడం విశేషం.ఈ లుక్ కి మహేష్ ఫ్యాన్స్ భాగానే ఫిదా అయ్యారు.

అయితే ఆ బ్రాండ్ తో వచ్చిన అశోక్ ని ఎంత వరకు ప్రోత్సహిస్తారనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube