వైసీపీ ప్రభుత్వం‌పై టీడీపీ నేత మండిపాటు.. ఇంతకు ఏం జరిగిందంటే.. ?

ఏ రాష్ట్రంలో జరగని లడాయిలు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయనే అపవాదు ఇప్పటికే ఉండగా వాటిని నిజం చేస్తూ నిత్యం ఏపీ రాజకీయ నాయకులు ఏదో ఒక రూపకంగా వార్తల్లో నిలుస్తున్నారు.మాటల యుద్ధాలే కాదు, గ్రూపు తగాదాల్లో కుడా ఇక్కడి నాయకులు తమ పట్టు విడవడం లేదట.

 Andrapradesh, Tdp, Ashok Gajapati Raju, Ycp Government-TeluguStop.com

ఇలా ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ అందరి నోళ్లో నానుతున్నారు.తాజాగా ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు కూడా వైసీపీ ప్రభుత్వం‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తనకు ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను అనువంశిక ధర్మకర్తగా ఎలా తొలగించారని మండిపడుతూ, ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 28కి తూట్లు పొడుస్తూన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారట.

ఈ పరిస్దితులను గమనిస్తే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశ్యంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తోందని, అందుకే కావచ్చూ శ్రీ రాముని కొత్త విగ్రహాల తయారీ నిమిత్తం తాను ఇచ్చిన కానుకను తిరస్కరించారని ఇలా చేయడానికి అర్ధం ఏంటని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అశోక్‌ గజపతిరాజు.

ఇలా వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్ల, మాటల యుద్దం కోత్తేమి కాకపోయినా విని విని ఏపి ప్రజలకు మాత్రం విసుగు వస్తుందనే గుసగుసలు మొదలయ్యాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube