Ashmita karnani : నటి అస్మితను వాళ్లు దారుణంగా వేధించారట.. ఆమె ఏం చేసిందంటే?

ప్రముఖ నటి అస్మిత సినిమాలు, సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరై మంచి పేరును సంపాదించుకున్నారు.నేను సాఫ్ట్, హంబుల్ గా ఉంటానని అయితే నన్ను ఎవరైనా చిన్న చూపు చూస్తే మాత్రం ఊరుకోనని అస్మిత తెలిపారు.

 Ashmita Karnani Shocking Comments Goes Viral In Social Media Details Here , Ash-TeluguStop.com

షూటింగ్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఇద్దరు వ్యక్తులు కారును ఆపేసి నేను యాక్సిడెంట్ చేశానని చెబుతూ డబ్బులు ఇవ్వాలని బెదిరించారని అస్మిత పేర్కొన్నారు.

ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడం వాళ్లు పారిపోవడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక వ్యక్తి విండో నుంచి హార్రిబుల్ గా చూస్తున్నాడని అస్మిత తెలిపారు.ఆ సమయంలో ఫోన్ లో రికార్డ్ చేస్తే సరిపోతుందని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.

మరో సందర్భంలో నన్ను ట్రబుల్ చేసేవాళ్ల ఫోటోలు, బైక్ నంబర్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని అస్మిత అన్నారు.

Telugu Agnisakshi, Ashmita Karnani, Jubilee Hills, Serials, Tollywood-Movie

నేను ఫేస్ బుక్ లో పెడతానని చెబితే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దక్కడంతో నేను ధైర్యంతో పోస్ట్ చేశానని ఆమె వెల్లడించారు.నేను అలా చేయడంతో అమ్మాయిలు ఇప్పుడు ఫోన్ తీస్తే అబ్బాయిలు పారిపోతున్నారని చెబుతున్నారని అస్మిత తెలిపారు.నన్ను వేధించిన వాళ్లను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారని ఆమె అన్నారు.

అస్మిత ఓసీడీ క్యాండిడేట్ అని ఆమె భర్త అన్నారు.మన చుట్టూ వాతావరణం నీట్ గా ఉంటే మన ఆలోచనలు కూడా నీట్ గా ఉంటాయని అస్మిత తెలిపారు.

నీట్ గా లేకపోతే నేను ఆ ప్లేస్ కు దూరంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.అస్మిత వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

అస్మిత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.అస్మిత కెరీర్ పరంగా మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube