ఆషాడ మాసం రాగానే చేతులకి గోరింటాకు పెట్టుకోమని ఎందుకంటారో తెలుసా.? కారణం ఇదే.!  

సాధారణంగా గోరింటాకు అంటే ఇష్టపడని మహిళలు చాలా అరుదుగా ఉంటారు.పండుగలైనా.వేడుకలు అయినా ముందుగా ఆడవారు గోరింటాకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.పూర్వం రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది..

Ashada Masam Special Importance Of Gorintaku 2--

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు… గోరింటాకు గుర్తుకువస్తుంది.ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు.ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగానూ.ఆధ్యాత్మికంగాను ఎన్నో ఉపయోగాలున్నాయి.ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది.

గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది.ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి..

బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది.కాబట్టి అనారోగ్యాలు తప్పవు.

అందుకే గోరింటాకు పెట్టుకుంటారు.గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది.అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

అంతే కాదు ఈ కాలంలో ర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం.గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది.

ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు.పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

ఇన్ని ఉపయోగాలు ఉన్నందు వల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.

మహిళలు.ఈ ఆషాడంలో అందంతో పాటు.

ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ అరచేతుల నిండా నింపుకోండి.