మరో ప్రాణం తీసిన కరోనా వ్యాక్సిన్‌.. ఆశావర్కర్‌ మృతి.. ?

కరోనా నుండి ప్రజలను రక్షిస్తుందని ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకుంటున్న వారిలో కొందరికి ఈ వ్యాక్సిన్ శాపంలా మారి పోతుంది.ఇక నాలుగు రోజుల క్రితం గుంటూరులో కరోనా టీకా తీసుకున్న ఓ ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్ కావడం కలకలం రేపింది.

 Asha Worker Died With Corona Vaccine Affect-TeluguStop.com

తాడేపల్లి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశా కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)లకు ఈ నెల 20న వ్యాక్సిన్ వేశారు.దీని కారణంగా లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్ రాగా, విజయ లక్ష్మిలో మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయట.

దీంతో ఇద్దరినీ 22వ తేదీన గుంటూరు జీజీహెచ్ కి చికిత్స నిమిత్తం తరలించారు.ఈ క్రమంలో విజయలక్ష్మి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో విజయలక్ష్మి చనిపోయినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆదివారం ఉదయం ప్రకటించారు.దీంతో వీరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

ఇక మృతిరాలి బంధువులు మాత్రం విజయ మరణానికి వ్యాక్సినే కారణమం అని ఆందోళనకు దిగినట్టు సమాచారం.

కాగా, విజయలక్ష్మికి వేసిన టీకా వయల్ నుంచే మరో డాక్టర్ కు వ్యాక్సిన్ వేసినా, అతనిలో ఎటువంటి రియాక్షన్ రాలేదని తెలుస్తోంది.

#Dead #Corona Vaccine #Affect #Vijaylaxmi #Guntur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు