ఏనుగు బిన్‌లాడెన్‌ మృతి

అస్సాంలో అయిదుగురు ప్రాణాలను తీసిన మదపుటేనుగు బిన్‌లాడెన్‌ మృతి చెందింది.జనాలను అత్యంత భయంకరంగా క్రూరంగా చంపేసిన ఏనుగుకు స్థానికులు బిన్‌లాడెన్‌ అంటూ పేరు పెట్టారు.

 Asam Elephant Bin Laden Is Dead-TeluguStop.com

పశ్చిమ అస్సోంలో గోల్‌పూరా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో అధికారులు ఈనెల 11న ఏనుగును గుర్తించి దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు.మత్తు మందు ఇచ్చి దాదాపు నాలుగు రోజులు కష్టపడి బిన్‌ లాడెన్‌ను పట్టుకున్నారు.

బిన్‌ లాడెన్‌కు ఎక్కువ మత్తు ఇవ్వడం జరిగిందట.

మొదట ఏనుగును అటవి ప్రాంతంలో వదిలి పెట్టాలని భావించారు.

ఆ తర్వాత స్థానిక నేషనల్‌ పార్క్‌లో ఉంచాలనుకున్నారు.నేషనల్‌ పార్క్‌కు తీసుకు వెళ్లిన అటవి శాఖ అధికారులు అక్కడకు వెళ్లి ఏనుగును దించారు.

అయితే అటవి శాఖ అధికారులు దించి వెళ్లిన రెండు రోజుల్లోనే బిన్‌ లాడెన్‌ చనిపోయింది.మత్తు ఎక్కువ ఇవ్వడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన బిన్‌ లాడెన్‌ మృతి చెందినట్లుగా స్థానికులు అనుకుంటున్నారు.

అయిదుగురు ప్రాణాలు తీసిన ఆ ఏనుగుపై ఏ ఒక్కరికి కనికరం లేదు.జంతు ప్రేమికులు మాత్రం లాడెన్‌ మృతిపై బాధను వ్యక్తం చేస్తున్నారు.

జనాలు లాడెన్‌ అని పిలుచుకునే ఈ ఏనుగుకు అటవి శాఖ అధికారులు మాత్రం కృష్ణ అన్న పేరు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube