అసలేం జరిగిందంటే అంటున్న రమణా...   

Asalem Jarigindante Movie Trailer Out Now - Telugu Asalem Jarigindante, Asalem Jarigindante Movie Latest News, Asalem Jarigindante Movie News, Asalem Jarigindante Movie Trailer,, Kumanan, Mahendran, Srinivas Bandari, అసలు ఏం జరిగిందంటే

టాలీవుడ్ లో తాజాగా నూతన దర్శకుడు శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం “అసలు ఏం జరిగిందంటే”.ఈ చిత్రంలో అప్పట్లో బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న టువంటి మహేంద్రన్ హీరోగా నటించాడు.

 Asalem Jarigindante Movie Trailer Out Now

 హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది.అలాగే ఈ చిత్రంలో సరిలేరు నీకెవ్వరు ఫేమ్ కుమనన్, హరితేజ, షఫీ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రాన్ని ఏబీఆర్ ప్రొడక్షన్ మరియు జి.ఎస్ ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మించాయి.

అసలు ఏం జరిగిందంటే అంటున్న రమణా… -Latest News-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.ఒకసారి ఈ ట్రైలర్ ని పరిశీలిస్తే ఈ చిత్రం సస్పెన్స్ ధ్రిల్లర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేగాక అక్కడక్కడ హర్రర్ ఛాయలు కూడా కనిపిస్తాయి.అయితే చిత్రంలో నటుడు కుమనన్ మాంత్రికుడి పాత్రలో నటించినట్లు తెలుస్తుంది.

అయితే హీరో మహేంద్రన్ కూడా తన పాత్రకి బాగానే న్యాయం చేశాడని చెప్పవచ్చు.దాదాపుగా చాలా ఏళ్ల తర్వాత హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ మహేంద్రన్ మాత్రం బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని ఈనెల 20వ తారీఖున విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే చిన్నప్పుడు బాలనటుడిగా దేవి, పెదరాయుడు వంటి చిత్రాల్లో మహేంద్రన్ బాగానే ఆకట్టుకున్నాడు.అంతేగాక బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు.అయితే ఏమైందో ఏమో కానీ మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన చదువు పై దృష్టి పెట్టి ఈ మధ్యకాలంలో గత కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమకి దూరంగా ఉంటున్నాడు.

బాలనటుడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి మహేంద్రన్ ఇప్పుడు హీరోగా ఎలా ఆకట్టుకుం టాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Asalem Jarigindante Movie Trailer Out Now Related Telugu News,Photos/Pics,Images..