మలబద్ధకం వేధిస్తుందా.. ఇంగువ‌తో చెక్ పెట్టండిలా?

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య మ‌ల‌బ‌ద్ధ‌కం.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, తీసుకునే ఆహారంలో ఫైబ‌ర్ లేక‌పోవ‌డం, శ‌రీరానికి స‌రిప‌డా నీరు అందించ‌క‌పోవ‌డం, పెయిన్ కిల్ల‌ర్స్ అధికంగా వాడ‌టం, హార్మోన్ల మార్పులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను ఎలా నివారించుకోవాలో తెలియ‌క‌.చాలా మంది హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతుంటారు.అయితే నిజానికి ఇంట్లోనే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే.సులువుగా మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 Asafoetida Helps To Get Rid Of Constipation! Asafoetida, Constipation, Benefits-TeluguStop.com

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ఇంగువ మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో చిటికుడు ఇంగువ క‌లిపి.సేవించాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.

గ్రీన్ టీలో ఉండే కొన్ని ప‌త్యేక‌ పోష‌కాలు.ప్రేగు కదలికలను వేగవంతం చేసి, మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి ఎప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

అందువ‌ల్ల, ఎవ‌రైతే ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారో.వారు రోజుకు రెండు క‌ప్పుల గ్రీన్ టీని తీసుకోవ‌డం ఉత్త‌మం.

అలాగే వాముతో కూడా మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని దూరం చేసుకోవ‌చ్చు.అందుకు ముందుగా వాము తీసుకుని.లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వామును పొడి చేసి.డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఈ వాము పొడిని అర స్పూన్ చ‌ప్పున ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఓ గ్లాస్‌ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి సేవించాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక పైన చెప్పుకున్న టీప్స్‌తో పాటు వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

ఫైబ‌ర్ ఉండే ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.ఫైబ‌ర్ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును వేగ‌వంతం చేసి.

మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారిస్తుంది.అలాగే ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి.

త‌ర‌చూ పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌టం త‌గ్గించాలి.త‌ద్వారా మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటుంది.

Asafoetida Helps To Get Rid Of Constipation! Asafoetida, Constipation, Benefits Of Asafoetida, Asafoetida For Health, Home Remedies, Inguva, Health, Health Tips, Good Health, Digestive Problems, Malabaddakam, Acidity, Fiber Foods, Pain Killers - Telugu Acidity, Asafoetida, Fiber Foods, Tips, Inguva, Malabaddakam, Pain Killers #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube