ఆవులు కావాలంటున్న అసదుద్దీన్ ! ఏంటి సంగతి...?  

తెలంగాణలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఈ రెండు పార్టీల నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీపై తాజాగా ఎంఐఎం సెటైర్ వేసింది.

Asaduddin To Raise Cows-

Asaduddin To Raise Cows

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామని ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మరి నాకు కూడా ఆవులు ఇస్తారా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఒక వేళ నాకు ఆవులను ఇస్తే గౌరవంగా చూసుకుంటానని ఓవైసీ హామీనిచ్చారు.