ఆపండి : పౌరసత్వ బిల్లుపై కోర్టుకెక్కిన ఒవైసీ  

Asaduddin Filed Peition In Supreme Court-

జాతీయ ఫౌరసత్వ బిల్లుపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవడంతో పాటు దాన్ని చట్టంగా మార్చడంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.జాతీయ ఫౌరసత్వ చట్టంలో మార్పులను గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీం కోర్టు మెట్లెక్కారు.

Asaduddin Filed Peition In Supreme Court- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Asaduddin Filed Peition In Supreme Court--Asaduddin Filed Peition In Supreme Court-

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని, పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దంగా ఉంది అంటూ అసద్ తన వాదనను పిటిషన్ రూపంలో సుప్రీం కోర్ట్ లో వేశారు.

అసలు అసదుద్దీన్ వాదన ఒక్కసారి పరిశీలిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, ఇక్కడే అనధికారికంగా జీవిస్తున్న బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్ ప్రజలను భారత జాతీయులుగా గుర్తించడంతో పాటు, ఈ గుర్తింపు నుంచి ముస్లింలను మినహాయించాలి అన్నది తాజాగా కేంద్రం తీసుకువచ్చిన ఫౌరసత్వ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం.

లోక్‌సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టినపుడు అసదుద్దీన్ దీనిని వ్యతిరేకించారు.లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి మెజారిటీ ఉండడంతో పౌరసత్వ సవరణ బిల్లు సులువుగానే నెగ్గింది.

ఆ తర్వాత రాజ్యసభకు ఈ బిల్లు చేరినపుడు కొంత ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంది.ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.

.

తాజా వార్తలు

Asaduddin Filed Peition In Supreme Court- Related....