వైరల్ వీడియో: పెళ్లి అయిందన్న ఆనందంలో పెళ్లి కూతురు చేసిన పనికి వరుడు వీపు వాచిపోయిందిగా...?!

ప్రతిరోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు.

 As The Groom Swelled His Back For The Work Done By The Bride In The Joy Of Getti-TeluguStop.com

ముఖ్యంగా వివాహానికి సంబంధించిన వీడియోలను బాగా లైక్ చేస్తుంటారు.ఈ మధ్య పెళ్లి వేడుకల్లో నూతన వధూవరులు డాన్స్ చేయడం, ఆటలు ఆడడం లాంటివి బాగా ట్రెండీగా మారిపోయాయి.

ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లి అయిన ఓ జంట తమ ఆనందాన్ని తట్టుకోలేక ఒక పని చేసి అందరిలోనూ నవ్వులపాలు అయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారంటీ.పెళ్లి కూతురు మాట ఎలా ఉన్నాగానీ పాపం పెళ్లికూతురు చేసిన పనికి వరుడు నడుము కాస్త వాచిపోయిందనే చెప్పాలి.

అసలు ఇంతకీ ఆ నూతన వధూవరులు చేసిన పని ఏంటో ఒక లుక్ వేద్దామా.

పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది.

అందుకే పెళ్లిరోజును గుర్తుండిపోయేలా ఎంతో ఘనంగా చేస్తారు.ఈ క్రమంలోనే పెళ్లిరోజున ఒక జంట అత్యుత్సాహం ఇప్పుడు వాళ్లని చిక్కుల్లో పడేసింది.

సరదాగా వచ్చిన అతిధుల ముందు ఈ జంట ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేయాలనుకున్నారు.ఎంతో గ్రాండ్ లుక్ తో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ, నవ్వుతూ స్టేజ్ పైకీ ఎంట్రీ ఇచ్చారు.

డాన్స్ చేస్తే కొత్తదనం ఏమి ఉందిలే అని అనుకున్నారో ఏమో కాస్త వెరైటీగా వరుడు తన వీపుపై కాబోయే భార్యను ఎక్కించుకొని డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించాడు.ఆమెను వీపుపైకి ఎక్కించుకుని ఒకటి రెండు స్టెప్పులు బాగానే వేసాడు.

ఆ తర్వాత ఆమె వధువు బరువును మోయలేక అమాంతం ఇద్దరు కూడా కింద పడిపోయారు.వారు అలా కింద పడడం చూసి అక్కడ ఉన్నవారు అంతా పకా పకా నవ్వడం మొదలుపెట్టారు.

కింద పడినా వధువులో ఏ మాత్రం ఎనర్జీ తగ్గలేదు.వెంటనే లేచి మళ్ళీ డాన్స్ చేయడం మొదలుపెట్టింది.పాపం వరుడు మాత్రం కొన్ని క్షణాలు అలానే ఉండిపోయి మెల్లిగా పైకి లేచాడు.వధువు మాత్రం పడితే పడ్డాడులే నాకెందుకు అని పడిన అతన్ని లేపకుండా ఎంచక్కా తను మాత్రం లేచి చిందులు వేసింది.

అలా చిందులు వేస్తున్న ఆ వధును చూసి అక్కడ ఉన్న గెస్ట్ లు అందరు షాక్ అయ్యారు.వధువు అతి ఉత్సాహంతో వరుడు వీపు కాస్త వాచిపోయింది.

ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్స్ మీద లైక్స్ ఇస్తూ షేర్ చేస్తున్నారు.

అలాగే వీడియో చూసిన వారు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube