బైకును కారులా మార్చాడుగా.... ఒకేసారి ఆరుగురు.. వీడియో వైరల్....

మనదేశంలో బైకుపై ఇద్దరూ మాత్రమే ప్రయాణించడానికి పర్మిషన్ ఉంది.ఇద్దరికన్నా ఎక్కువ అంటే ముగ్గురు వ్యక్తులు బైక్ పై ప్రయాణిస్తూ ఉంటే పోలీసులు చలానా కూడా విధిస్తూ ఉంటారు.

 As The Bike Was Converted Into A Car Six People At The Same Time Video Viral ,-TeluguStop.com

అలాంటిది ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి ఒక బైక్ పై ఐదు మంది స్కూల్ పిల్లలను కూర్చోబెట్టుకుని బైక్ ను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌ తో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలో ఒక వ్యక్తి తన బైక్ పై ఐదుగురు పిల్లల్ని ఎక్కించుకున్నాడు.అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి.తాను డ్రైవ్ చేస్తూ తన ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఇద్దర్ని కూర్చొబెట్టుకున్న యువకుడు తన వెనుక మరో ముగ్గుర్ని కూర్చొబెట్టుకున్నాడు.ఝాన్సీలోని బాలాజీ రోడ్డులో ఈవిధంగా ఆరుగురు ఒకే బైక్‌పై వెళ్తుండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

సిప్రీ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కి అత్యంత సమీపంలోనే ఈసంఘటన జరిగింది.బైక్‌పై ఆరుగురు ప్రయాణించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.బైక్‌పైన ఆరుగురు వెళ్తుంటే అదే రోడ్డులో కారులో వెళ్తున్న వ్యక్తి చూసి ఆశ్చర్యపోయి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈవిధంగా ఇష్టం వచ్చినంత మందిని బైక్‌పై తీసుకెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని కామెంట్ పోస్ట్ చేశాడు.

బైక్‌పై అరడజను మంది ప్రయాణించడమే కాదు బైక్‌పై కాళీ లేకుండా వాళ్లకు సంబంధించిన క్యారేజ్ బాక్సులు, స్కూల్‌ బ్యాగ్‌లను రెండు వైపుల తగిలించడంతో కనీసం పిల్లలు ఊపిరాడనంత ఇబ్బందికరంగా కూర్చున్న దృశ్యం వీడియోలో చూడొచ్చు.ఇలాంటి స్టంట్స్ చేస్తున్న వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే పిల్లలు ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు ఈ వీడియో చూస్తే నువ్ సూపర్ రైడర్‌వి బాబు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.మరికొందరు పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచేస్తే బైకుల్ని కార్‌లుగా మార్చక ఏం చేస్తారంటూ సెటైర్‌లు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube