అక్కడ ప్రజలు నేపాల్ వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటున్నారట.. ఎందుకో తెలుసా ?

పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు రోజురోజుకూ పెంచుతూ మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.రోజురోజుకూ పెరుగుతూ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

 As Prices Of Petrol In India Spiral Smuggling Of Fuel From Nepal Rises, Nepal,-TeluguStop.com

ఏకంగా 100 రూపాయల మార్క్ కూడా టచ్ చేసి రికార్డు సృష్టించింది.అంతేకాదు చమురు ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి.

ఇంతకు ముందు 75 నుండి 85 రూపాయల మధ్య ఉండే పెట్రోల్ 100 రూపాయలు తాకుతుంటే సామాన్యుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.ఇక్కడ ధరలు మండిపోవడంతో భారత్ నేపాల్ సరిహద్దు ప్రదేశాలవారయినా బీహార్, ఉత్తరాఖండ్ ప్రజలు నేపాల్ వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుకుంటున్నారట.

అంతేకాదు కొంతమంది పెట్రోల్, డీజిల్ ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నేపాల్ లో పెట్రోల్ 113 రూపాయలు కాగా.

మన దగ్గర వచ్చే సరికి అది 70 రూపాయల 79 పైసలు అవుతుంది.దీంతో కొంతమంది అక్రమ దారులు బైక్ ఈడ ఒక్కో ట్రిప్పుకు 5 లీటర్ల చొప్పున భారత్ కు తెచ్చుకుని ఇక్కడ 90 నుండి 95 రూపాయలకు అమ్ముతూ వాళ్ళ జేబులు నింపు కుంటున్నారు.

Telugu Rupees Petrol, Rupees, Bihar, Diesel, Fuel, India, Nepal, Petrol, Uttarak

నార్త్ బీహార్ లోని చాలా మంది వాహనదారులు నేపాల్ బోర్డర్ దాటి వెళ్లి మరి అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.నేపాల్ లో భారత్ వాహనాలకు పెట్రోల్ కొట్టించుకోకూడదని రూల్స్ ఏమి లేనందున కొంతమంది తమ ఇష్టాను సారంగా రోజుకు ఐదారు ట్రిప్పులు వెళ్లి మరి పెట్రోల్ కొనుక్కుని వస్తున్నారు.

అంతేకాదు భారత్ పెట్రోల్ బంకులలో కంటే 4 రూపాయలు తక్కువకే ఇస్తుండడంతో వాహన దారులు కూడా వీరి దగ్గరే పెట్రోల్ కొనుక్కునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.దీంతో ఆ ప్రాంతంలోని పెట్రోల్ బంకులు జనాలు లేక నష్టపోతున్నారు.

ఇలా పెట్రోల్ అమ్ముకుని అక్రమదారులు రోజుకు 2000 రూపాయలు దాకా సంపాదిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు.

అయితే నేపాల్ కు దగ్గరగా ఉండే చంపావత్ జిల్లాలో కూడా ఈ అక్రమ రవాణా సాగుతుంది.

ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.మాకు పెట్రోల్ అక్రమంగా తరలిస్తున్నారని ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

నేపాల్ లో వాహనదారులు లీగల్ గా పెట్రోల్ కొంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube