బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఒకరు.ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ డాటర్ ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుని తన వైపుకు తిప్పుకుంది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వక పోయిన జాన్వీ అందం, నటనకు మంచి పేరు అయితే వచ్చింది.
దీంతో ఈ భామ బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుని అక్కడ దూసుకు పోతుంది.ఇక అక్కడ స్టార్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అనుభవిస్తూనే ఈ భామ ఇప్పుడు తెలుగు తెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతుంది.జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఈ భామ చాలా రోజులుగా తెలుగు మూవీ చేయడం కోసం ఎదురు చూడగా ఎట్టకేలకు ఎన్టీఆర్ సరసన అవకాశం లభించింది. కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ”దేవర( Devara )” వంటి భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.జాన్వీకి ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.మరి ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం.అందుకేనేమో ఈమె కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది.హైదరాబాద్ లో ఈ భామ తాజాగా 39 కోట్లు పెట్టి ఇల్లు కొనింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
దేవర షూటింగ్ కోసం జాన్వీ తరచూ ముంబై నుండి హైదరాబాద్ వెళ్లి రావాల్సి ఉండడంతో చాలా ఇబ్బంది పడుతుందట.హోటల్స్ లో ఉండడం కష్టం అని అమ్మడు ఏకంగా హైదరాబాద్ మకాం మార్చినట్టు తెలుస్తుంది.