ఉన్నట్లుండి పెంపుడు పావురం మాయం.. అమెరికాలో ప్రత్యక్షం.. అసలు కథ తెలిస్తే!!

బ్రిటన్‌లో మాయమైన ఒక పావురం తాజాగా అమెరికాలో ప్రత్యక్షమయ్యింది.అదెలా సాధ్యం అంటే అది ఏకంగా ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి చేరుకుంది.

 As It Is, The Pet Pigeon Is Gone. Live In America. If You Know The Real Story!!-TeluguStop.com

ఆరు వేల కిలోమీటర్లు అంటే మామూలు విషయమా.అందుకే ఈ సంగతి తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.అలెన్ టాడ్ (60) అనే వ్యక్తి బ్రిటన్‌లోని గేట్స్‌హెడ్‌లోని బ్లైడన్‌లో జీవిస్తున్నాడు.

ఇతడు ఓ పావురాన్ని ప్రేమగా పెంచుకునేవాడు .దానికి బాబ్ అని పేరు పెట్టి ఎంతో గారాబంగా చూసుకునేవాడు.అయితే ఒకరోజు ఉన్నట్లుండి ఆ పావురం అదృశ్యమయింది.అలా అదృశ్యమైన పావురం కోసం యజమాని వెతకని చోటంటూ లేదు.అయితే ఇటీవల అమెరికా జంతు సంరక్షణ అధికారులు అతనికి ఫోన్ చేసి మీ పావురం మా వద్దే ఉందని చెప్పారు.దాంతో అతను ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

బ్రిటన్‌కి, అమెరికాకి మధ్య కనీసం 3,700 మైళ్ల దూరం ఉంటుంది.ఫోన్ కాల్ వినగానే “అంత దూరం నా పావురం ఎలా దాటింది? అసలు అమెరికాకి ఎలా చేరుకుంది?” అనే ఆలోచనలతో అలెన్ అయోమయంలో పడిపోయాడట.ఆ తర్వాత అసలు సంగతి తెలిసి అవునా అలా జరిగిందా అంటూ నోరెళ్లబెట్టడం అతని వంతయిందట.

ఇంతకీ ఏం జరిగిందంటే.ఈ పావురం గ్వెర్న్సీ అనే ద్వీపం నుంచి తన యజమాని ఇంటికి వెళ్ళాలి అనుకుంది.కానీ అది పొరపాటు పడింది.

అలా అది రాంగ్ రూట్‌లో వెళుతూ 6 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి యూఎస్ చేరుకుంది.ఆ తర్వాత ఒక వృద్ధుని తోటలో వాలింది.

దానిని అతను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు.కానీ ఆ పావురం అక్కడ్నుంచి వెళ్ళిపోయేందుకు ససేమిరా అనేసిందట.

దాంతో చేసేది లేక జంతు సంరక్షణ అధికారులకు సమాచారం అందించాడు.అప్పుడు వారు ఆ పావురాన్ని రక్షించి దాని మెడలో ఉన్న మైక్రోచిప్, జియో ట్యాగ్ ను పరిశీలించి అది బ్రిటన్ కి చెందిన పావురం అని కనుగొన్నారు.

అనంతరం దాని యజమాని పేరు కూడా తెలుసుకున్నారు.అలా అతనికి ఫోన్ చేసి విషయం చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న అతను మొదటిగా ఆశ్చర్యపోయాడు.ఆ తర్వాత తన ముద్దుల పావురం బతికే ఉందని ఎంతో సంబర పడుతున్నాడు.అయితే, ఈ పావురాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు అలెన్‌ రూ.2.8 లక్షల ఖర్చు పెట్టడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube