నటిగా అమ్మ నాన్నలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే: జాన్వీ కపూర్

దివంగత నటి అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి కూతురిగా తన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీ కపూర్.ఈమె ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

 As An Actress Its The Return Gift Of Mom And Dad Janhvi Kapoor, Janhvi Kapoor, Sridevi, Bollywood, Dhadak-TeluguStop.com

ఈ సినిమా అనంతరం గుంజన్‌ సక్సేనా వంటి పలు సినిమాలలో నటించే సందడి చేశారు అయితే ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.ఈ సినిమా విడుదలైనప్పటినుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి జాన్వీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చారు.

 As An Actress Its The Return Gift Of Mom And Dad Janhvi Kapoor, Janhvi Kapoor, Sridevi, Bollywood, Dhadak-నటిగా అమ్మ నాన్నలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే: జాన్వీ కపూర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తనకు ధడక్ గుంజన్ సక్సేనా వంటి సినిమాలు ఎంతో సులభంగా అవకాశాలు వచ్చాయని అయితే ఒక స్టార్ కిడ్ గా నాకు ఎంతో సులభంగా ఈ అవకాశాలు వచ్చాయని అనుకున్నాను.

Telugu Bollywood, Dhadak, Janhvi Kapoor, Sridevi-Movie

టెక్నికల్ గా ఆలోచిస్తే కేవలం నన్ను చూసి అవకాశాలు రాలేదని అమ్మానాన్నల వల్ల నాకు ఈ అవకాశాలు వచ్చాయని తెలిసింది.అందుకుగాను వారిపై నాకు ఎంతో ప్రేమ గౌరవం ఉందని ఈమె తెలిపారు.ఇక తనకు నటన అంటే ప్రాణమని తెలిపిన జాన్వీ కపూర్.

నా తల్లిదండ్రుల ప్రేమకి,వారి వల్ల నాకు వస్తున్న ఈ సినిమా అవకాశాలకు నటిగా నేను కూడా నా తల్లిదండ్రులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.నటిగా వారికి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనంటూ జాన్వీ కపూర్ తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube